close
Choose your channels

ఓవర్ సీస్ లో క్లాసిక్ ఎంటర్ టైన్మెంట్స్ ద్వారా శ్రీరస్తు - శుభమస్తు

Thursday, July 28, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అల్లు శిరీష్ - లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా ప‌రుశురామ్ తెర‌కెక్కించిన చిత్రం శ్రీర‌స్తు - శుభ‌మ‌స్తు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో అల్లు అర‌వింద్ నిర్మించారు. వైవిధ్య‌మైన ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన శ్రీర‌స్తు - శుభ‌మ‌స్తు చిత్రాన్ని ఆగ‌ష్టు 5న రిలీజ్ చేస్తున్నారు. సౌతిండియ‌న్ మూవీస్ ని ఓవర్ సీస్ లో రిలీజ్ చేసే ప్ర‌ముఖ డిస్ర్టిబ్యూష‌న్ సంస్థ క్లాసిక్ ఎంట‌ర్ టైన్మెంట్ శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు ఓవ‌ర్ సీస్ రైట్స్ ద‌క్కించుకుంది.
యువ‌త‌, సోలో, సారొచ్చారు చిత్రాల ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ అందిస్తున్న మ‌రో ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ఇది.ఈ చిత్రంలో ప్ర‌కాష్ రాజ్, రావు ర‌మేష్‌, సుమ‌ల‌త త‌దిత‌రులు ముఖ్య‌పాత్ర‌లు పోషించారు. త‌మ‌న్ అందించిన సాంగ్స్ కి ఇప్ప‌టికే మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. అలాగే ఇటీవ‌ల రిలీజ్ చేసిన ట్రైల‌ర్ కు ఫిల్మ్ క్రిటిక్స్ & ఆడియ‌న్స్ నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తుంది. అల్లు శిరీష్ కెరీర్ లో శ్రీర‌స్తు - శుభ‌మ‌స్తు ట‌ర్నింగ్ పాయింట్ అవుతుంది అనే న‌మ్మ‌కంతో ఉన్నారు చిత్ర‌యూనిట్. మ‌రి...అంద‌రి అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు శ్రీర‌స్తు - శుభ‌మ‌స్తు శిరీష్ కి ట‌ర్నింగ్ పాయింట్ అవుతుంద‌ని ఆశిద్దాం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.