close
Choose your channels

గ్రేట్ డైరెక్ట‌ర్ ప‌రుశురామ్ తెర‌కెక్కించిన శ్రీర‌స్తు - శుభ‌మ‌స్తు 100 రోజులు ఆడాలి - డైరెక్ట‌ర్ క్రిష్

Tuesday, July 26, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అల్లు శిరీష్ - లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా ప‌రుశురామ్ తెర‌కెక్కించిన చిత్రం శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మించారు. ఆగ‌ష్టు 5న శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సంద‌ర్భంగా శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు ధియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ను ప్ర‌సాద్ ల్యాబ్స్ లో డైరెక్ట‌ర్ క్రిష్ రిలీజ్ చేసారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత అల్లు అర‌వింద్ మాట్లాడుతూ...యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. ఈ సినిమా ఎవ‌ర్ని నిరాశ‌ప‌ర‌చ‌దు ఖ‌చ్చితంగా ఆక‌ట్టుకుంటుంది. ట్రైల‌ర్ ను రిలీజ్ చేసిన క్రిష్ కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. ఈ నెల 31న శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ చేస్తున్నాం. ఈ కార్య‌క్ర‌మానికి చిరంజీవి గారు ముఖ్య అతిధిగా హాజ‌రై శిరీష్ ని ఆశీర్వ‌దిస్తారు. ఈ కార్య‌క్ర‌మానికి ఫ్యాన్స్ అంద‌రూ వ‌చ్చి విజ‌యవంతం చేయాల‌ని కోరుతున్నాను అన్నారు.

డైరెక్ట‌ర్ ప‌రుశురామ్ మాట్లాడుతూ...క్రిష్ లాంటి సంస్కార‌వంతుడు చేతుల మీదుగా ట్రైల‌ర్ రిలీజ్ చేయించి ఆశీస్సులు తీసుకుంటే మంచి జ‌రుగుతుంద‌ని ఆయ‌తో ట్రైల‌ర్ రిలీజ్ చేయించాం. నేను క‌న్ ఫ్యూజ‌న్ లో ఉన్న‌ప్పుడు క్రిష్ ఇచ్చిన ధైర్యం ఎప్ప‌టికీ మ‌రువ‌లేను. ఆయ‌న మాట‌లు నా వెన‌క క్రిష్ ఉన్నాడ‌నే ధైర్యాన్ని ఇచ్చాయి. ఆ స‌మ‌యంలో క్రిష్ చెప్పిన మాట‌లు నా లోపాలు స‌రిదిద్దుకునేలా చేసాయి. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లో సినిమా గురించి మాట్లాడతాను అన్నారు.

హీరోయిన్ లావ‌ణ్య మాట్లాడుతూ...గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో వ‌ర్క్ చేయ‌డం హ్యాపీగా ఉంది. ప‌రుశురామ్ నా క్యారెక్ట‌ర్ ను అద్భుతంగా డిజైన్ చేసారు. శిరీష్ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వ‌ర్క్ చేసారు. త‌మ‌న్ పెంటాస్టిక్ మ్యూజిక్ అందించారు అన్నారు.

డైరెక్ట‌ర్ క్రిష్ మాట్లాడుతూ...నేను కొన్ని సినిమాలు చేయ‌డానికి ఇష్ట‌ప‌డతాను. కొన్ని సినిమాల‌ను చూడ‌డానికి ఇష్ట‌ప‌డ‌తాను. అలా ప‌రుశురామ్ సినిమాలు చూడ‌డం అంటే ఇష్టం. యువ‌త టైమ్ లో ప‌రుశురామ్ ని క‌లిసాను. అప్ప‌టి నుంచి మా ఇద్ద‌రి మ‌ధ్య ఆత్మీయ‌త ఏర్ప‌డింది. శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు క‌థ విన్నాను ఎక్సైటింగ్ స్టోరి. ప‌రుశురామ్ లో కావాల్సినంత ప్రేమ ఉంది. వేదం సినిమాకు బ‌న్ని న‌న్ను ప్రొత్స‌హించాడు. ఇప్పుడు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి తో మ‌రో్సారి ప్రొత్సాహం ల‌భించింది. అలా ప‌రుశురామ్ కి కూడా ప్రొత్సాహం ల‌భించాల‌ని కోరుకుంటున్నాను. ప‌రుశురామ్ గ్రేట్ డైరెక్ట‌ర్...అత‌ను రాసే క‌థ‌ను నేను డైరెక్ట్ చేయాల‌నుకుంటున్నాను. శిరీష్ గురించి చెప్పాలంటే....వ‌య‌సులో చిన్నోడు అయినా ప్రేమ విష‌యంలో మా అంద‌రికి పెద్ద‌న్న. ఈ సినిమాలో శిరీష్ బాడీ లాంగ్వేజ్ బాగుంది. కెరీర్ లో ఇంకా ముందుకు వెళ్లాలి. గీతా ఆర్ట్స్ లో వ‌ర్క్ చేయాలి అనుకుంటున్నాను. ఈ శ్రీర‌స్తు - శుభ‌మ‌స్తు 100 రోజులు ఆడాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

అల్లు శిరీష్ మాట్లాడుతూ...ఈ మూవీలో మంచి క‌థ‌తో పాటు ఎంట‌ర్ టైన్మెంట్ ఉంది. సినిమాటోగ్రాఫ‌ర్ మణికంఠ‌న్ న‌న్ను చాలా అందంగా చూపించారు. ఇక త‌మ‌న్ అద్భుత‌మైన మ్యూజిక్ అందించారు. క్రిష్ హిందీలో సినిమా చేస్తున్నాడ‌ని తెలిసి చాలా హ్యాపీగా ఫీల‌య్యాను. కంచె అనే గొప్ప సినిమా తీసాడు. చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత మ‌న సినిమాకి కంచె సినిమాతో జాతీయ అవార్డ్ రావ‌డం ఆనందం క‌లిగించింది. క్రిష్ తో మూవీ చేయాల‌నుకుంటున్నాను. ఆగ‌ష్టు 5న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రితో క‌లిసి శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు చూసి ఎంజాయ్ చేస్తార‌ని ఆశిస్తున్నాను అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.