close
Choose your channels

రాజుగారి గది2తోనే మొదలు..

Wednesday, August 9, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హాలీవుడ్‌లోనూ, బాలీవుడ్‌లోనూ సీక్వెల్ చిత్రాల‌కు మంచి ఆద‌ర‌ణ ఉంటుంది. అదే ద‌క్షిణాదిన మాత్రం ఆ స్థాయిలో ఆద‌ర‌ణ ఉండ‌డం లేదు. బాహుబ‌లి ఇందుకు మిన‌హాయింపు. అంతేకాకుండా.. బాహుబ‌లి ఒకే పార్ట్‌గా మొద‌లై.. ఆ త‌రువాత‌ రెండు పార్ట్‌లుగా తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే.. సీక్వెల్ చిత్రాలుగా వ‌చ్చిన ఆర్య 2, శంక‌ర్‌దాదా జిందాబాద్‌, నాగ‌వ‌ల్లి, అవును 2, స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ త‌దిత‌ర చిత్రాల‌కు, త్వ‌ర‌లో రానున్న‌ రాజు గారి గ‌ది 2 చిత్రానికి ఓ చిన్న తేడా ఉంది.
అదేమిటంటే.. గ‌తంలో వ‌చ్చిన సీక్వెల్ చిత్రాల‌న్నీ ఒరిజ‌న‌ల్ సినిమా విడుద‌లైన నెల‌లో కాకుండా వేరే వేరే నెల‌ల్లో వ‌చ్చాయి. అయితే.. రాజుగారి గ‌ది 2 మాత్రం.. రాజు గారి గ‌ది విడుద‌లైన అక్టోబ‌ర్ నెల‌లోనే విడుద‌ల కాబోతోంది. మ‌రి ఈ విధంగానైనా ఈ సీక్వెల్ హిట్ అవుతుందేమో చూడాలి. రాజుగారి గ‌ది2లో నాగార్జున‌, స‌మంత‌, సీర‌త్‌క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. రాజుగారి గ‌ది డైరెక్ట‌ర్ ఓంకార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.