close
Choose your channels

ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌లో సుమంత్‌

Saturday, April 28, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌లో సుమంత్‌

గత ఏడాది విడుద‌లైన‌ 'మళ్ళీ రావా' చిత్రం విజయంతో మ‌రోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కేసారు హీరో సుమంత్. ఆ చిత్రంలో కార్తీక్‌గా సుమంత్ నటన పలువురి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు తన సిల్వర్ జుబ్లీ ఫిల్మ్‌లో కూడా ఆ పేరుతోనే మరోసారి ప్రేక్షకులను పలకరించనున్నారు సుమంత్. ఆ వివరాల్లోకి వెళితే.. సుమంత్ కెరీర్‌లో 25వ చిత్రంగా తెరకెక్కుతోంది 'సుబ్రమణ్యపురం'.

ఈ చిత్రంతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కానున్నారు. తెలుగ‌మ్మాయి ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీకరణ జ‌రుపుకుంటోంది.

ఇదిలా ఉంటే.. సుమంత్ ఈ సినిమాలో నాస్తికుడిగా, హేతువాదిగా కార్తీక్ అనే పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది.   గ్రామీణ వాతావరణంలో పెరిగిన సంప్రదాయమైన అమ్మాయిగా ఈషా రెబ్బా కనిపించనుంద‌ని స‌మాచారం.

ఇన్వెస్టిగేషన్ నిమిత్తమై సుబ్రమణ్యపురంకి కార్తీక్ రాగా.. అతనికి తన వంతు సాయాన్ని అందించే ప్రియ పాత్రలో ఈషా నటిస్తోంది. కాగా.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి సుమంత్ గత చిత్రంలాగే ఈ సినిమాకి కూడా కార్తీక్ పేరు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.