close
Choose your channels

సన్నీలియోన్ నటిస్తున్న 100 కోట్ల భారీ చిత్రం వీరమహాదేవి

Friday, May 18, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సన్నీలియోన్ నటిస్తున్న 100 కోట్ల భారీ చిత్రం వీరమహాదేవి

స్టివ్స్ కార్నర్ పతాకంపై ఫోన్స్ స్టీఫెన్ నిర్మాతగా వి .సి.వడివుడయాన్ దర్శకత్వంలో సన్నీలియోన్ నటిస్తున్న భారీ చారిత్మాత్మక చిత్రం వీరమహాదేవి. 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఒకేసారి 5 భాషల్లో షూటింగ్ జరుపుకొంటుంది. సన్నీలియోన్ తెలుగులో మొదటిసారి నటిస్తున్నందున ఆమె తెలుగు నేర్చుకొంటున్నారు .

నాజర్ మరియు తమిళ్ ,మలయాళం , కన్నడ మరియు హిందీ భాషలలోని ప్రముఖ నటులు ఇందులో నటిస్తున్నారు . యుద్ధ సన్నివేశాలకొరకు సుమారు 1000 గుర్రాలు మరియు ఏనుగులు ఉన్నందున నటీనటులకు గుర్రపుస్వారిలో శిక్షణ ఇస్తున్నాము. సన్నీలియోన్ దుస్తులు దక్షిణభారత సంప్రదాయంలో ఉంటాయి .వీటిని ముంబై తో తయారు చేస్తున్నాము.

రామోజీఫిలింసిటీలో భారీ సెట్ వేయుటకు సన్నాహాలు చేస్తున్నాము . కేరళలోని అడవులలో ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో భారీ ఫైటింగ్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాము . గ్రాఫిక్స్ ఎక్కువగా ఉన్నందున కెనడా లోని కంపెనీ మరియు ఇక్కడ ఒక ముఖ్య కంపెనీ కలసి పనిచేస్తున్నాయి .

lord of the rings మరియు gods of the egypt చిత్రాలకు పనిచేసినవారు ఈ చిత్రానికి గ్రాఫిక్స్ పర్యవేక్షకులుగా పనిచేస్తున్నారు .గ్రాఫిక్స్ కోసం సుమారుగా 40 కోట్లు ఖర్చుపెడుతున్నాము . ఈ చిత్రం కోసం సన్నీలియోన్ 150 రోజులు కేటాయించారు. భారీఅంచనాలున్న ఈ చిత్రం ఫస్టులుక్ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదల చేస్తున్నాము.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.