close
Choose your channels

Harish Shankar: దుమ్మురేపుతోన్న 'ఈగల్' కలెక్షన్స్.. వారికి హరీశ్ శంకర్ కౌంటర్..

Monday, February 12, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దుమ్మురేపుతోన్న ఈగల్ కలెక్షన్స్.. వారికి హరీశ్ శంకర్ కౌంటర్..

మాస్ మహారాజా రవితేజ(Raviteja) హీరోగా నటించిన ‘ఈగల్’ సినిమా థియేటర్లలో అదరగొడుతోంది. గత శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ మూవీ తొలి ఆట నుంచే హిట్ టాక్‌ తెచ్చుకుంది. యాక్షన్ సీన్స్‌లో రవితేజ అదరగొట్టేసాడని, కార్తీక్ డైరెక్షన్ సూపర్బ్‌గా ఉంది. దీంతో మూవీ చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. మొదటి రోజే రూ.12 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. చాలా రోజుల తర్వాత రవితేజ నుంచి సోలో హిట్ రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ఇక ఈగల్' మూవీకి నైజాంలో రూ. 6.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగు రాష్ట్రాలో రూ. 17.00 కోట్లకు థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయాయి. అలాగే కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ.2 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ.2 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ.21.00 కోట్లు బిజినెస్ జరిగింది. ఇప్పుడు మూడు రోజుల్లో కలిపి రూ.30కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరో రెండు రోజుల్లో రూ.50కోట్లు రాబట్టడం ఖాయమని అంచనా వేస్తున్నారు.

దుమ్మురేపుతోన్న ఈగల్ కలెక్షన్స్.. వారికి హరీశ్ శంకర్ కౌంటర్..

ఈ సందర్భంగా 'ఈగల్' టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ హరీశ్ శంకర్ ఓ వెబ్‌సైట్‌పై తీవ్రంగా మండిపడ్డారు. "ఓ డైరెక్టర్ నాలుగేళ్లుగా సినిమా తీయట్లేదు.. రాత్రంతా తాగుతూ ఉన్నాడు.. గతంలో పవన్ కళ్యాణ్‌తో బ్లాక్ బస్టర్ తీశాడు అంటూ రాస్తారు. ఫోటో వేయరు.. ఏదో షాడో ఫోటో వేస్తారు.. అది ఇంకెవరు.. నేనే.. నా ఫోటో, పేరు రాసే ధైర్యం లేదు.. దైర్యం ఉంటే నా ఫోటో వేసి రాయండి.. నేను కౌంటరిస్తాను.. సినీ పరిశ్రమ అంటే కేవలం హీరో , దర్శక నిర్మాతలు మాత్రమే కాదు.. సినీ జర్నలిస్టులు కూడా పరిశ్రమలో ఒక భాగమే. మనం మనం కొట్టుకుని, తిట్టుకుని వేరేవాళ్ల ముందు తక్కువ అవ్వడం ఎందుకు. క్రిటిసైజ్‌కు.. ట్రోలింగ్ కు తేడా తెలియకుండా పోతుంది.

మనం ఒకే జట్టుగా ఉన్నాం. మీరు ఆ గట్టు మీద.. మేం ఈ గట్టు మీద లేపు.. అందరం కలిస్తేనే సినీ పరిశ్రమ కాదు.. కూడదు.. ఇలాగే నెగిటివ్ రివ్యూస్ రాస్తాం.. మీ సినిమాలు వస్తాయి కదా ? మీ సంగతి చూస్తాం.. అనుకుంటే మీ అభిమాన హీరో చెప్పిన డైలాగ్ గుర్తుంది కదా" అంటూ చెప్పకొచ్చారు. ప్రస్తుతం హరీశ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా పవన్ కల్యాణ్‌తో తీస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో ప్రస్తుతం రవితేజతో 'మిస్టర్ బచ్చన్' మూవీని హరీశ్ తెరకెక్కిస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos