close
Choose your channels

11న డైరెక్ట్ గా మార్కెట్ లో S3 ఆడియో

Saturday, December 10, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వినూత్న‌మైన క‌థాంశాల‌తో పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ ఇమేజ్ సంపాందించుకున్న సూర్య హీరోగా న‌టించిన తాజా చిత్రం ఎస్ 3. ఈ చిత్రంలో సూర్య స‌ర‌స‌న‌ శ్రుతిహ‌స‌న్‌, అనుష్క న‌టించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి హ‌రి ద‌ర్శ‌కుడు. గ‌తంలోయ‌ముడు, సింగం చిత్రాలు ఘ‌న‌విజ‌యాలు సాధించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌డు అదే సిరీస్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రాన్నిస్టూడియో గ్రీన్‌ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా స‌గ‌ర్వంగా స‌మ‌ర్పిస్తూ తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత‌ మల్కాపురం శివకుమార్, సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హేరిస్ జైరాజ్ అందించిన ఆడియోని ఈనెల 11 న డైర‌క్టుగా మార్కెట్ లోకి విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నికార్య‌క్ర‌మాలు పూర్తి చేసి ఈ నెల 23 న విడుదల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత‌ల్లో ఒక‌రైన మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ...త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌ అభిమానుల్ని సంపాదించుకున్న సూర్య‌, హరి కాంబినేషన్‌లో రూపొందిన య‌ముడు, సింగం చిత్రాలు ఘ‌న‌విజయాల్ని సాధించాయి. వాటికి కొనసాగింపుగా వస్తోన్న చిత్రం " 'S3'య‌ముడు-3". డైర‌క్ట‌ర్ హ‌రి గారు ఈ చిత్రాన్ని మాస్ యాక్ష‌న్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ప‌రుగులు పెట్టే స్క్రీన్‌ప్లే తో థ్రిల్ ని క‌లిగించే స‌న్నివేశాల‌తో ఈ చిత్రం కొన‌సాగుతుంది. ఇప్ప‌టికే విడుద‌లైన‌ టీజ‌ర్స్ చూసి ప్రేక్ష‌కుల అంచనాలు పెరిగాయి. వారి అంచ‌నాలు అందుకునేలా మా చిత్రం వుండ‌బోతుంది. సూర్య గారు ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ గా యాక్ష‌న్ లో మ‌రోక్క‌సారి విజృభించారు.
అనుష్క న‌ట‌న‌కి ఈసారి శ్రుతిహ‌స‌న్ గ్లామ‌ర్ అడిష‌న‌ల్ గా ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌నుంది. నీతినిజాయితీలే ఊపిరిగా భావించే ఓ పోలీస్ అధికారి వృత్తి నిర్వహణలో తనకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. తెలుగు వెర్ష‌న్ లో మా సంస్థ భాగ‌స్వామి అయినందుకు చాలా అనందంగా వుంది. హేరిస్ జైరాజ్ అందించిన ఆడియోని ఈనెల 11 న డైర‌క్టుగా మార్కెట్ లోకి విడుద‌ల చేస్తున్నాం. చిత్రాన్ని అన్నికార్య‌క్ర‌మాలు పూర్తి చేసి 23 న విడుదల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాం. రాధికా శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టించారు అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.