స్వాతి రీ ఎంట్రీ
Send us your feedback to audioarticles@vaarta.com
కలర్స్ ప్రోగ్రాంతో పాపులర్ అయిన స్వాతి.. తర్వాత సినిమాల్లో నటిగా, సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మెప్పించింది. ఇటీవల మలేషియన్ ఎయిర్ లైన్స్ ఫైలట్‌ను వివాహం చేసుకుని సెటిలైంది. తాను సినిమాల నుండి దూరం కాలేదని.. మంచి పాత్ర వస్తే చేస్తానని ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పిన స్వాతి త్వరలోనే వెండితెరపై సందడి చేయబోతుంది.
వివరాల్లోకెళ్తే.. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్, స్వాతి నటించిన చిత్రం `కార్తికేయ` చాలా పెద్ద విజయాన్నే సాధించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా `కార్తికేయ 2`ని తెరకెక్కించబోతున్నాడు చందు మొండేటి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే సెట్స్‌కు సినిమా వెళ్లనుంది. కార్తికేయ సినిమాలో గుడికి సంబంధించిన సీక్రెట్‌ను చేధించిన నిఖిల్.. ఈసారి గుహ సీక్రెట్‌ను చేధిస్తాడో.. మరేమైనా సీక్రెట్‌ను ఛేదిస్తాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments