close
Choose your channels

ఐదు భాష‌ల్లో సైరా

Sunday, August 18, 2019 • తెలుగు Comments

ఐదు భాష‌ల్లో సైరా

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న హిస్టారిక‌ల్ చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌గా ఈ సినిమా నిర్మిత‌మ‌వుతోంది. అమితాబ్ బ‌చ్చ‌న్‌, నయ‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి, కిచ్చా సుదీప్‌, జ‌గ‌ప‌తిబాబు, ర‌వికిష‌న్‌, నిహారిక‌, త‌మ‌న్నా త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ధారులుగా న‌టించారు. ఈ సినిమాను అక్టోబ‌ర్ 2న విడుద‌ల చేసేలా స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను ఎన్ని భాష‌ల్లో రిలీజ్ చేస్తార‌నే దానిపై క్లారిటీ రాలేదు. అయితే ఈరోజు అధికారికంగా చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. టీజ‌ర్ పోస్ట‌ర్‌ను ఐదు భాష‌ల్లో విడుద‌ల చేయ‌డం ద్వారా సినిమాను ఐదు భాష‌ల్లో ప్ర‌క‌టిస్తున్నట్టు ప్ర‌క‌టించింది. సినిమా టీజ‌ర్ చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 22న విడుద‌ల చేయ‌బోతున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz