close
Choose your channels

తాప్సీ ప‌ని పూర్తి

Tuesday, December 4, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తాప్సీ ప‌ని పూర్తి

సొట్ట బుగ్గ‌ల సుంద‌రి తాప్సీ ద‌క్షిణాది, ఉత్త‌రాదిన మంచి కాన్సెప్ట్ సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది. 'బేబి', 'నామ్ ష‌బానా', 'పింక్‌', 'జుడ్వా 2' చిత్రాల‌తో హీరోయిన్‌గా త‌న‌కంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పుడు తెలుగు, త‌మిళంలో `గేమ్ ఓవ‌ర్‌` అనే సినిమాను పూర్తి చేసింది.

అక్టోబ‌ర్ రెండో వారంలో ప్రారంభమైన ఈ సినిమాను లాంగ్ షెడ్యూల్‌లోనే పూర్తి చేసేశారట‌. ఈ సినిమా గురించి త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో తాప్సీ తెలియ‌జేస్తూ "వీల్ చెయిర్‌లోనే కూర్చుని న‌టించ‌డం అనేది మర‌చిపోలేని ఎక్స్‌పీరియెన్స్. నా ప‌నిని పూర్తి చేశాను. మంచి జ్ఞాప‌కాల‌తో వెళుతున్నాను" అంటూ మెసేజ్‌ను పోస్ట్ చేసింది తాప్సీ.

రిలయ‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అసోసియేష‌న్‌తో గురు, శ‌శికాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు న‌య‌న‌తార‌తో 'మ‌యూరి' అనే సినిమాను డైరెక్ట్ చేసిన అశ్విన్ శ‌ర‌వ‌ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.