close
Choose your channels

కన్నతల్లిదండ్రులపైనే కేసు పెట్టిన విజయ్... పేరు వాడుకోవడం తప్పా..?

Monday, September 20, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తమిళ స్టార్ హీరో, ఇళయ దళపతి విజయ్ కన్న తల్లిదండ్రులపైనే కేసు పెట్టి సంచలనం సృష్టించారు. అనుమతి లేకుండా తన పేరు వాడుతున్నారంటూ తల్లిదండ్రులతో పాటు మరో 11 మందిపై కేసు పెట్టారు. వివరాల్లోకి వెళితే... గతేడాది క్రితం విజయ్‌ మక్కల్‌ ఇయ్యకమ్‌ పేరుతో ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్‌ పార్టీ పెట్టారు. పార్టీకి ప్రధాన కార్యదర్శి, కోశాధికారిగా విజయ్‌ తల్లిదండ్రులు ఉన్నారు. అయితే తండ్రి పెట్టిన పార్టీతో తనకు సంబంధం లేదని హీరో విజయ్‌ గతంలో ప్రకటించారు. కానీ, తల్లిదండ్రులు విజయ్‌ పేరుతో పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని, తన పేరు వాడుకుంటున్నారని ఆరోపిస్తూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈఘటన తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.

విజయ్ తాజా చర్యకు కారణం... ఇళయ దళపతి ఫ్యాన్స్‌కు చెందిన ఓ రిజిస్టర్డ్ సొసైటీకి స్థానిక ఎన్నికల్లో పాల్గొనేందుకు, ఆయన తల్లిదండ్రులు అనుమతినిచ్చారు. దాంతో కొందరు తాము విజయ్ అభిమానులమంటూ స్వతంత్రులుగా బరిలోకి దిగుతున్నారు. అంతేకాకుండా సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా విజయ్ వరకు వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా తన పేరు పొలిటికల్ మీటింగ్స్‌కి వాడుకోవటంపై అభ్యంతరం తెలియజేస్తూ విజయ్ కోర్టును ఆశ్రయించారు. విజయ్ తన తల్లిదండ్రులతో సహా మరికొందరిపై వేసిన కేసు సెప్టెంబర్ 27న విచారణకు రావచ్చంటున్నారు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.