close
Choose your channels

బన్నీతో తమిళ దర్శకుడి సినిమా?

Wednesday, April 4, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బన్నీతో తమిళ దర్శకుడి సినిమా? 

‘రాజా రాణి’, ‘తెరి’ (తెలుగులో ‘పోలీస్’), ‘మెర్సల్’ (తెలుగులో ‘అదిరింది’) చిత్రాలతో స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ అనిపించుకున్నారు తమిళ దర్శకుడు అట్లీ కుమార్. అవడానికి తమిళ ద‌ర్శ‌కుడే అయినా.. త‌న చిత్రాలు తెలుగులో అనువదింపబడడం వ‌ల‌న తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితులయ్యారు అట్లీ. ఫక్తు కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సినిమాలను తీసి.. వాటికి ఒకటి, రెండు సామాజిక అంశాలతో కూడిన సన్నివేశాలను జోడించి సినిమాలను విజయవంతం చేసుకోవడం ఈ డైరెక్టర్ స్టైల్. తమిళంలో విజయవంతమైన ఈ దర్శకుడు.. ఇప్పుడు తెలుగులో కూడా ఓ డైరెక్ట్ సినిమా చేసి తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు.

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి చర్చల దశలోనే ఈ ప్రాజెక్ట్ ఉందనీ.. త్వరలోనే ఓ కొలిక్కి వస్తుందనీ.. కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఈ ప్రాజెక్ట్‌పై ఓ క్లారిటీ వస్తుందని అట్లీ స‌న్నిహితులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్‌కి ఇదివరకే ఓ కథను వినిపించారు తమిళ దర్శకుడు ఎన్. లింగుస్వామి. కథ ఓకే అవడంతో ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించారు. కాని ఆ సినిమా ఇప్పటివరకు సెట్స్ పైకి వెళ్ళలేదు. ఆ డైరెక్టర్ ఇంకా వెయిటింగ్‌లోనే ఉన్నారు. ఈ సమయంలో అట్లీతో సినిమా అంటే.. మరి బన్నీ ఏ రకంగా ప్లాన్ చేస్తారో చూడాలి. 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.