close
Choose your channels

TDP Final List: టీడీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల.. గంటా పోటీ అక్కడి నుంచే..

Friday, March 29, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

TDP Final List: టీడీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల.. గంటా పోటీ అక్కడి నుంచే..

పెండింగ్‌లో ఉన్న నాలుగు ఎంపీ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. భీమిలి నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, చీపురుపల్లి నియోజకవర్గం నుంచి సీనియర్ నేత కళా వెంకట్రావుకు చోటు కల్పించింది. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటన విడుదల చేశారు.

అసెంబ్లీ అభ్యర్థులు..

చీపురుపల్లి- కళా వెంకట్రావు
భీమిలి- గంటా శ్రీనివాసరావు
పాడేరు(ఎస్టీ)- కిల్లు వెంకట రమేష్ నాయుడు
దర్శి- డా. గొట్టిపాటి లక్ష్మి
ఆలూరు- వీరభద్రగౌడ్
గుంతకల్లు- గుమ్మనూరి జయరాం
అనంతపురం అర్బన్- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్
రాజంపేట- సుగవాసి సుబ్రహ్మణ్యం
కదిరి- కందికుంట వెంకటప్రసాద్

పార్లమెంటు అభ్యర్థులు..

విజయనగరం- కలిశెట్టి అప్పలనాయుడు
ఒంగోలు- మాగుంట శ్రీనివాసులు రెడ్డి
అనంతపురం- అంబికా లక్ష్మీనారాయణ
కడప- భూపేష్ రెడ్డి

కాగా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ తరపున పోటీ చేస్తున్నారు. దీంతో బొత్సకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును అక్కడి నుంచి పోటీ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. అయితే గంటా మాత్రం తాను భీమిలి నుంచే పోటీ చేస్తానని స్పష్టంచేశారు. దీంతో చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావుకు అవకాశం కల్పించి.. గంటాకు భీమిలి స్థానాన్నే కేటాయించారు.

పొత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ సీట్లలో పోటీ చేస్తుంది. ఇప్పటివరకు 135 స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులు.. 13 స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా పెండింగ్‌లో ఉన్న స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో మొత్తం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లైంది. అటు బీజేపీ కూడా 6 ఎంపీ, 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. జనసేన మాత్రం 18 అసెంబ్లీ, ఓ ఎంపీ స్థానానికి అభ్యర్థులను ప్రకటించింది. ఇక మూడు ఎమ్మెల్యే సీట్లు, మరో పార్లమెంట్ స్థానానికి అభ్యర్థులను వెల్లడించాల్సి ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.