close
Choose your channels

వైసీపీ రూపంలో కేసీఆర్.. టీడీపీకి భయం

Monday, March 25, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైసీపీ రూపంలో కేసీఆర్ ఉన్నారని.. వైసీపీని చూస్తే టీడీపీకి భయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అవనిగడ్డలో జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. "జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితే ఎలా వుంటుందో ఊహించుకోండి. ప‌దేళ్ల‌పాటు కేసీఆర్ ఆంధ్రుల్ని తిడుతుంటే నోరు మెద‌ప‌ని వ్య‌క్తి. ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వం కాపాడ‌లేని వ్య‌క్తి ముఖ్య‌మంత్రి ఎలా అవుతాడు.

ఆంధ్రుల్ని తిట్టిపోసిన కేసీఆర్ ఇప్పుడు వైసీపీ రూపంలో మీ ముందుకు వస్తున్నారు. మీ మీద కోడి క‌త్తితో దాడి జ‌రిగితే దేశం మొత్తం తెలిసేలా గగ్గోలు పెట్టారు. ఇప్పుడు మీ సొంత చిన్నాన్న హ‌త్య జ‌రిగితే ప‌ట్టించుకోరా. ముందు మీ ఇంట్లో చ‌క్క‌బెట్టుకోండి త‌ర్వాత రాష్ట్రం సంగ‌తి ఆలోచించవ‌చ్చు. కిరాయి మూక‌ల్ని వెంటేసుకు తిరిగే మీరు ఆడ‌ప‌డుచుల‌కి ర‌క్ష‌ణ ఎలా క‌ల్పిస్తారు" అని జనసేన అధినేత పవన్ ఎద్దేవా చేశారు.

టీడీపీ నేత‌ల‌కి వైసీపీ అంటే భ‌యం.

"ఇక టీడీపీ వ‌స్తే బంద‌రు పోర్టు పేరుతో అవ‌స‌రం లేక‌పోయినా రైతుల భూములు లాక్కుని వ్యాపారం చేసుకుంటారు. అవినీతి పెరిగిపోతుంది. ఇప్ప‌టికే ఇసుక మాఫియా, మ‌ట్టి మాఫియాలు త‌యారై దోచేశారు. పైగా టీడీపీ నేత‌ల‌కి వైసీపీ అంటే భ‌యం. ఆ పార్టీ నాయ‌కుల్లో గుండె ధైర్యం లేదు. ఎవ‌రినైనా ఎదిరించే ఆ ద‌మ్ము ధైర్యం జ‌న‌సైనికుల‌కి మాత్ర‌మే ఉంది. కానీ రెండు పార్టీలు రాజ‌కీయం మా ఇంటి సొత్తు అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. బంద‌రులో ఆర్కే గారిని ఎమ్మెల్యే అభ్య‌ర్ధిగా నిల‌బెడితే దాని మీద విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడుతారు.

జ‌న‌సేన నాయ‌కుల‌కి, మిగిలిన పార్టీల నాయ‌కుల‌కి తేడా ఉంది. విదేశాల్లో వ్యాపారాలు చేసి సంపాదించిన మొత్తంతో ఇక్క‌డ సేవ చేయాల‌ని వచ్చిన వ్య‌క్తి బండ్రెడ్డి రామ్ గారిని ఎంపి అభ్య‌ర్ధిగా నిల‌బెట్టాం. వైసీపీ నాయ‌కులు, టీడీపీ నాయ‌కులు ఇక్క‌డ దోచుకుంది విదేశాల‌కి తీసుకువెళ్లి దాచుకుంటున్నారు. జ‌న‌సేన‌లో ఇంకా ఎలాంటి వ్య‌క్తులు ఉన్నారంటే పార్టీ పొలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీ చైర్మ‌న్ శ్రీ శేఖ‌ర్‌ పులి మీ బంద‌రువాసి. అమెరికాలో కంపెనీ పెట్టి అభివృద్ది చేసి రూ. 2 వేల కోట్ల‌కి అమ్మేశారు. ఆ డబ్బుతో అనేక మందికి ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించారు. రూ. 20 కోట్ల అమెరిక‌న్ స్కూల్స్‌కి విరాళం ఇచ్చారు. అలాంటి వ్య‌క్తి నా ప‌క్క‌న ఉండ‌డం చాలా గ‌ర్వంగా ఉంది" అని పవన్ చెప్పుకొచ్చారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.