close
Choose your channels

ఆయూస్ సంస్థకు జెంటిల్ మన్ టీం & అభిషేక్ పిక్చర్స్ సపోర్ట్

Saturday, June 4, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్ లో స్కూల్ ఫీజు లు కట్టుకోలేని పిల్లల కోసం ఆయూస్ సంస్థ చేయూత నిచ్చేందుకు ముందుకు వచ్చింది. పిల్లల భవిష్యత్ మెరుగు పడాలంటే విద్యను మించిన ఆయుధం లేదని ఆయూస్ సంస్థ నిర్వాహకులు తెలియ‌చేసారు. ఈ ఆయూస్ సంస్థ‌ ఏర్పాటు చేసిన పార్టీ కి జెంటిల్ మ‌న్ టీమ్ హాజ‌రై ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.
సమాజం లో మంచి పౌరులుగా ఎదగాలంటే ఎడ్యుకేషన్ అందరికీ అందుబాటులో ఉండాలని నిర్వాహకులు తెలియ‌చేసారు. జెంటిల్ మ‌న్ టీమ్ తో పాటు డిస్ట్రిబ్యూషన్ రంగం లో అగ్రగామి సంస్థ అయిన అభిషేక్ ఫిలిమ్స్ కూడా ఇలాంటి సేవ కార్యక్రమాల్లో మేము ఎప్పుడూ ముందు ఉంటామని అభిషేక్ ఫిలిమ్స్ పార్ట్ నర్ అభిషేక్ అగర్వాల్ తెలిపారు. హీరో నాని, డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ, మరియు నిర్వాహకులు రాధిక అగర్వాల్, స్నేహలత, సోనమ్, అర్చన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో భాగంగా నిర్వహించిన పూల్ పార్టీ ద్వారా వచ్చిన మొత్తం మనీని పిల్లల చదువుల కోసం వినియోగిస్తాం అని నిర్వాహకులు తెలియ‌చేసారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.