close
Choose your channels

ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ సినిమా కోసం త‌మ‌న్ క‌స‌ర‌త్తులు

Wednesday, April 18, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ సినిమా కోసం త‌మ‌న్ క‌స‌ర‌త్తులు

యువ సంగీత ద‌ర్శ‌కుడు తమన్‌కు 2018 బాగానే కలిసొస్తుంద‌నే చెప్పాలి.  సినిమాల ఫలితాల సంగ‌తి పక్కన పెడితే.. తన సంగీతంతో శ్రోత‌ల‌ను బాగానే అలరిస్తున్నారు. ముఖ్యంగా.. 'భాగ‌మ‌తి', 'తొలిప్రేమ' చిత్రాల కోసం త‌మ‌న్ అందించిన సంగీతానికి మంచి మార్కులు ప‌డ్డాయి. ఇదిలా ఉంటే.. ఈ ఏడాదిలో  ఓ భారీ ప్రాజెక్ట్‌కు సంగీతమందించే అవ‌కాశాన్ని అందిపుచ్చుకున్నారు త‌మ‌న్‌. ఆ చిత్ర‌మే.. ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ తొలి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమా.

ఈ చిత్రం కోసం త‌మ‌న్ త‌న కెరీర్‌లోనే బెస్ట్ ఆల్బ‌మ్ ఇవ్వ‌బోతున్నాడ‌ని స‌మాచారం. సంగీతంపై మంచి అభిరుచి ఉన్న త్రివిక్రమ్.. అలాగే ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న తమన్ కలయికలో పాటలంటే ఖచ్చితంగా అంచనాలు ఉంటాయి. దాంతోపాటు.. తమన్ తొలిసారి త్రివిక్రమ్‌తో కలిసి పనిచేయనుండ‌డంతో ఈ సినిమా పాటలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా.. ఇప్పటికే  త్రివిక్రమ్‌కు నచ్చే విధంగా ట్యూన్స్ ఇవ్వడం కోసం కసరత్తులు ప్రారంభించార‌ట‌ తమన్. కాగా.. ద‌స‌రా కానుక‌గా ఈ సినిమా తెర‌పైకి రానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.