దరువు మొదలెట్టిన తమన్
Send us your feedback to audioarticles@vaarta.com
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అల్లు అర్జున్ సినిమా కోసం మ్యూజిక్ సిద్ధం చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని తెలియజేసిన తమన్, బన్ని, త్రివిక్రమ్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు.
అరవింద సమేత తర్వాత త్రివిక్రమ్‌తో తమన్ పనిచేస్తున్నాడు. కాగా బన్ని నటించిన చాలా సినిమాలకు తమన్ ఇది వరకే సంగీతం అందించాడు. మరి ఈ సినిమాలో తమన్ మ్యూజిక్ దబిడ దిబిడ ఉంటుందా? లేక మెలోడీకీ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందా? అని తెలియాలంఏట కొన్నిరోజులు ఆగాల్సిందే. అయితే బన్ని సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి... మెలోడీకే ఎక్కువ ప్రాధాన్యం ఉండే అవకాశాలున్నాయంటున్నాయి సినీ వర్గాలు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.