close
Choose your channels

TDP Jana Sena:టీడీపీ- జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. మొత్తం ఎన్ని స్థానాలంటే..?

Saturday, February 24, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీడీపీ- జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. మొత్తం 118 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేశారు. ఇందులో టీడీపీ 94 అసెంబ్లీ స్థానాల్లో.. జనసేన 24 స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. అయితే 175 నియోజకవర్గాల్లో జనసేన 24 స్థానాల్లో.. అలాగే 3 పార్లమెంట్ స్థానాల్లో మాత్రమే పోటీ చేయనుందని స్పష్టంచేశారు. మిగిలిన 57 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీతో చర్చలు జరిపిన తర్వాత క్లారిటీ వస్తుందని తెలిపారు.

వైసీపీ ప్రభుత్వం నుంచి ఏపీకి విముక్తి కలిపించాలంటే రెండు పార్టీల కార్యకర్తలు, నేతలు సహకరించాలని ఇరు పార్టీల నేతలు విజ్ఞప్తి చేశారు. జగన్‌ను ఓడించడమే తమ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇరుపార్టీల సీనియర్‌ నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, యనమల రామకృష్ణుడు, నాదెండ్ల మనోహర్, నాగబాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌ మాట్లాడుతూ ప్రస్తుతానికి ఐదు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తున్నామని.. మిగిలిన 19 స్థానాల్లో అభ్యర్థులను ఒకటి రెండు రోజుల్లో వెల్లడిస్తామని పేర్కొన్నారు. నెల్లిమర్లలో మాధవి, అనకాపల్లిలో కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్‌లో పంతం నానాజీ, రాజానగరంలో బత్తుల బలరామకృష్ణ , తెనాలిలో నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారని ప్రకటించారు.

టీడీపీ అభ్యర్థుల జాబితా ఇదే..

ఇచ్ఛాపురం- బెందాళం అశోక్‌
టెక్కలి-అచ్చెన్నాయుడు
ఆమదాలవలస-కూన రవికుమార్‌
రాజాం-కోండ్రు మురళి
కురుపాం - తొయ్యక జగదీశ్వరి
పార్వతీపురం - విజయ్‌ బోనెల
సాలూరు - గుమ్మడి సంధ్యారాణి
బొబ్బిలి-ఆర్‌ఎస్‌వీకేకే రంగారావు(బేబీ నాయన)
గజపతినగరం - కొండపల్లి శ్రీనివాస్‌
విజయనగరం - అదితి గజపతిరాజు
విశాఖ ఈస్ట్‌ - వెలగపూడి రామకృష్ణబాబు
విశాఖ వెస్ట్‌ - పీజీవీఆర్‌ నాయుడు
అరకు - సియ్యారి దొన్ను దొర
పాయకరావుపేట - వంగలపూడి అనిత
నర్సీపట్నం - చింతకాయల అయ్యన్నపాత్రుడు
తుని-యనమల దివ్య
పెద్దాపురం - నిమ్మకాయల చినరాజప్ప
అనపర్తి - నల్లిమిల్లి రామకృష్ణ రెడ్డి
ముమ్మిడివరం - దాట్ల సుబ్బరాజు
పి.గన్నవరం - రాజేశ్‌ కుమార్‌
కొత్తపేట - బండారు సత్యానంద రావు
మండపేట - జోగేశ్వరరావు
రాజమండ్రి సిటీ - ఆదిరెడ్డి వాసు
జగ్గంపేట - జ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ)
ఆచంట - పితాని సత్యనారాయణ
పాలకొల్లు - నిమ్మల రామానాయుడు
ఉండి - మంతెన రామరాజు
తణుకు - అరిమిల్లి రాధాకృష్ణ
ఏలూరు - బాదెటి రాధాకృష్ణ
చింతలపూడి - సోంగ రోషన్‌
తిరువూరు - కొలికపూడి శ్రీనివాస్‌
నూజివీడు - కొలుసు పార్థసారథి
గన్నవరం - యార్లగడ్డ వెంకట్రావు
గుడివాడ - వెనిగండ్ల రాము
పెడన - కాగిత కృష్ణ ప్రసాద్‌
మచిలీపట్నం - కొల్లు రవీంద్ర
పామర్రు - వర్ల కుమార రాజ
విజయవాడ సెంట్రల్‌ - బొండ ఉమ
విజయవాడ ఈస్ట్‌ - గద్దె రామ్మోహన రావు
నందిగామ - తంగిరాల సౌమ్య
జగ్గయ్యపేట - శ్రీరామ్‌ రాజగోపాల్‌ తాతయ్య
తాడికొండ - తెనాలి శ్రవణ్‌ కుమార్‌
మంగళగిరి - నారా లోకేశ్‌
పొన్నూరు - ధూళిపాళ్ల నరేంద్ర
వేమూరు(ఎస్సీ) - నక్కా ఆనంద్‌బాబు
రేపల్లె - అనగాని సత్యప్రసాద్‌
బాపట్ల - వి.నరేంద్ర వర్మ
ప్రత్తిపాడు(ఎస్సీ) - బూర్ల రామాంజినేయులు
చిలకలూరిపేట - ప్రత్తిపాటి పుల్లారావు
సత్తెనపల్లి - కన్నా లక్ష్మినారాయణ
వినుకొండ - జీవీ ఆంజనేయులు
మాచర్ల - జూలకంటి బ్రహ్మానందరెడ్డి
యర్రగొండపాలెం (ఎస్సీ) - గూడూరి ఎరిక్సన్‌ బాబు
పర్చూరు - ఏలూరి సాంబశివరావు
అద్దంకి - గొట్టిపాటి రవికుమార్‌
సంతనూతలపాడు (ఎస్సీ) - బొమ్మాజి నిరంజన్‌ విజయ్‌కుమార్‌
ఒంగోలు - దామచర్ల జనార్దనరావు
కొండపి - డోలా బాల వీరాంజనేయస్వామి
కనిగిరి - ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
కావలి - కావ్య కృష్ణారెడ్డి
నెల్లూరు సిటీ - పి. నారాయణ
నెల్లూరు రూరల్‌ - కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
గూడూరు (ఎస్సీ) - పాశం సునీల్‌కుమార్‌
సూళ్లూరుపేట (ఎస్సీ) - నెలవేల విజయశ్రీ
ఉదయగిరి - కాకర్ల సురేశ్‌
కడప - మాధవిరెడ్డి
రాయచోటి - మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
పులివెందుల- మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి
మైదుకూరు - పుట్టా సుధాకర్‌ యాదవ్‌
ఆళ్లగడ్డ - భూమా అఖిలప్రియ
శ్రీశైలం - బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
కర్నూలు - టీజీ భరత్‌
పాణ్యం - గౌరు చరితా రెడ్డి
నంద్యాల - ఎన్‌ఎండీ ఫరూక్‌
బనగానపల్లి - బీసీ జనార్దనరెడ్డి
డోన్‌ - కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి
పత్తికొండ - కేఈ శ్యాంబాబు
కోడుమూరు - బొగ్గుల దస్తగిరి
రాయదుర్గం - కాలవ శ్రీనివాసులు
ఉరవకొండ - కేశవ్‌
తాడిపత్రి - జేసీ అస్మిత్‌ రెడ్డి
శింగనమల (ఎస్సీ) - బండారు శ్రావణి శ్రీ
కల్యాణదుర్గం - అమిలినేని సురేంద్రబాబు
రాప్తాడు - పరిటాల సునీత
మడకశిర (ఎస్సీ) - ఎం.ఈ. సునీల్‌కుమార్‌
హిందూపురం - నందమూరి బాలకృష్ణ
పెనుకొండ - సవిత
తంబళ్లపల్లె - జయచంద్రారెడ్డి
పీలేరు - నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి
నగరి - గాలి భానుప్రకాశ్‌
గంగాధర నెల్లూరు (ఎస్సీ) - డాక్టర్‌ వీఎం. థామస్‌
చిత్తూరు - గురజాల జగన్మోహన్‌
పలమనేరు - ఎన్‌.అమర్‌నాథ్‌రెడ్డి
కుప్పం - నారా చంద్రబాబు నాయుడు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos