close
Choose your channels

మ‌ణిర‌త్నం కొత్త సినిమా పోస్ట‌ర్ అదిరింది..

Thursday, July 7, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అంద‌మైన ప్రేమ‌క‌థల‌ను అంతే అద్భుతంగా తెర‌కెక్కించ‌గ‌ల ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం. ఓకే బంగారం త‌ర్వాత మ‌ణిర‌త్నం ఏ సినిమా చేస్తారా అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకాభిమానుల‌కు త‌న త‌దుప‌రి చిత్రం ఎలా ఉంటుందో ఈరోజు పోస్ట‌ర్ లో చూపించేసారు. మ‌ణిర‌త్నం కార్తీ తో ఓ మూవీ చేస్తున్నారు. కాట్రు వెళి యుదై అనే టైటిల్ తో రూపొందే ఈ చిత్రంలో కార్తీ స‌ర‌స‌న బాలీవుడ్ న‌టి అదితి రావ్ హైద‌రి న‌టిస్తుంది. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు.

ఈరోజు మ‌ణిర‌త్నం ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేసారు. ఈ పోస్ట‌ర్ చూస్తుంటే ఇదో అంద‌మైన ప్రేమ‌క‌థా చిత్రం అనిపిస్తుంది. ఈ మూవీ ఫ‌స్ట్ షెడ్యూల్ ఊటీలో చేయ‌నున్నారు. న‌ల‌భై రోజులు పాటు జ‌రిగే ఫ‌స్ట్ షెడ్యూల్ కోసం చిత్ర‌యూనిట్ నిన్న‌నే ఊటీకి చేరుకున్న‌ట్టు స‌మాచారం. మొద‌టి షెడ్యూల్ పూర్త‌యిన త‌ర్వాత రెండో షెడ్యూల్ ను కాశ్మీర్ లో చేయ‌నున్నారు. కార్తీ తో చేస్తున్న ఈ సినిమాతో మ‌ణిర‌త్నం మ‌రో విజ‌యాన్నిసొంతం చేసుకుంటార‌ని ఆశిద్దాం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.