close
Choose your channels

ఆటాడుకుందాం రా అంటూ పాటేసుకుంటున్న జంట...

Thursday, June 30, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కాళిదాసు, క‌రెంట్, అడ్డా...చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న యువ క‌థానాయ‌కుడు సుశాంత్. తాజాగా సుశాంత్ ఆటాడుకుందాం రా అనే చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో సుశాంత్ స‌ర‌స‌న సోన‌మ్ బ‌జ్వా న‌టిస్తుంది. జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. శ్రీ నాగ్ కార్పోరేష‌న్ బ్యాన‌ర్ పై చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్ర‌స్తుతం ఈ చిత్రం కోసం ప‌ల్లెటూరి నేప‌ధ్యంలో వ‌చ్చే పాట‌ను హీరో సుశాంత్, హీరోయిన్ సోన‌మ్ బ‌జ్వా ల‌పై రామోజీ ఫిలింసిటీలో చిత్రీక‌రిస్తున్నారు. ఈ పాట ఈ చిత్రానికి ప్ర‌త్యేకార్ష‌ణ‌గా నిలుస్తుంది అంటుంది చిత్ర యూనిట్. విభిన్న క‌థాంశంతో రూపొందుతున్న ఆటాడుకుందాం రా చిత్రం పై సుశాంత్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మ‌రి...సుశాంత్ న‌మ్మ‌కం నిజ‌మై ఆటాడుకుందాం రా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని ఆశిద్దాం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.