close
Choose your channels

Bigg Boss 7 Telugu : గౌతమ్ రీ ఎంట్రీ, పోటుగాళ్ల దెబ్బకి తేలిపోతున్న ఆటగాళ్లు .. అమర్‌దీప్‌లో ఎలిమినేషన్ భయం

Wednesday, October 11, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ 7 తెలుగులో నామినేషన్స్ పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పోటుగాళ్లు vs ఆటగాళ్లు అంటూ వారిలో చిచ్చుపెట్టేందుకు బిగ్‌బాస్ ప్రయత్నిస్తున్నాడు. తొలి రోజే శోభాశెట్టితో అశ్విని గొడవ పెట్టుకుని, తర్వాత వెక్కి వెక్కి ఏడ్చింది. సోమవారం నాడు నామినేషన్స్ పూర్తికాకపోవడంతో.. మంగళవారం కూడా కంటిన్యూ చేశారు. ఈ వారం అమర్‌దీప్, ప్రిన్స్ యావర్, సందీప్, తేజ, శోభాశెట్టి, నయని, అశ్విని శ్రీ, పూజా మూర్తిలు నామినేట్ అయ్యారు. ఇంతలో ఆదివారం నాడు ఎలిమినేట్ అయిపోయాడు అనుకున్న గౌతమ్‌ను తిరిగి హౌస్‌లోకి తీసుకొచ్చాడు బిగ్‌బాస్. దీంతో ఇంటి సభ్యులంతా హ్యాపీగా ఫీలయ్యారు.

ఇంట్లోకి తీసుకురావడంతో పాటు గౌతమ్‌కి స్పెషల్ పవర్ కూడా ఇచ్చాడు బిగ్‌బాస్. నామినేట్ అయినవారిలో ఒకరిని సేవ్ చేయొచ్చు, లేదంటే నేరుగా నామినేట్ చేయొచ్చు. ఆ పవర్ ద్వారా సందీప్‌ని సేవ్ చేస్తున్నట్లు తెలిపాడు. హౌస్‌లోకి వచ్చి రాగానే శివాజీ, ప్రియాంకలతో గొడవేసుకున్నాడు గౌతమ్. గతంలో వాళ్లిద్దరూ చేసిన కామెంట్స్‌కి క్లాస్ పీకాడు. గౌతమ్ ఎక్కువ ఎంటర్‌టైన్ చేయలేడేమో అని .. కానీ ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ప్యాంట్ విప్పేసి తిరగడం కాదు కదా అని శివాజీకి కౌంటర్ వేశాడు. దీనికి శివన్న ఘాటుగానే బదులిచ్చాడు. నేను 100 సినిమాల్లో బట్టలు లేకుండా నటించా.. నేను నటుడిని , ఏమైనా చేయగలను అని వాదించడం మొదలుపెట్టాడు.

తర్వాత ఇంటి సభ్యులకు ‘‘ హూ ఈజ్ ఫిట్టెస్ట్ ’’ అంటూ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ గేమ్‌లో కంటెస్టెంట్స్ తమ ఫిట్‌నెస్‌ను చాటుకోవాల్సింది. ఇందుకోసం స్విమ్మింగ్ పూల్‌లో వున్న నెంబర్లు, గార్డెన్‌లో ఉన్న టైర్లని నెంబర్‌తో మ్యాచ్ చేసి పూల్‌లో ఉన్న ఓ కడ్డీకి తగిలించారు. బజర్ మోగే సమయంలో ఎవరైతే ఎక్కువ టైర్లు పెడతారో వారే విజేత. ఇందులో పోటుగాళ్లు టీమ్ నుంచి అర్జున్, గౌతమ్ జోడి గెలిచింది. తర్వాత ‘‘హూ ఈజ్ జీనియస్’’ అంటూ మరో గేమ్ పెట్టాడు బిగ్‌బాస్. ఆడదామని వెళ్లిన అమర్‌దీప్.. సరైన సమాధానాలు చెప్పలేక మధ్యలోనే వచ్చేశాడు. అతనికి బదులుగా వెళ్లిన తేజ కూడా సత్తా చూపలేదు. గౌతమ్ ఎక్కువ ప్రశ్నలకు జవాబు చెప్పడంతో మరోసారి పోటుగాళ్లు టీమ్ గెలిచింది.

అయితే ప్రతీ టాస్క్‌లోనూ ఫెయిల్ అవుతున్న అమర్‌దీప్‌లో కొత్త భయం పట్టుకుంది. ఈ వారం తాను ఎలిమినేట్ అవుతానేమోనని ఆయన వణికిపోతున్నాడు. దీనికి తోడు కొత్తగా వచ్చిన పూజా మూర్తి.. అమర్‌ను మరింత భయపెట్టింది. తాను బయట చూసిన అమర్‌దీప్ వేరు.. ఇక్కడ చూస్తున్న అమర్‌దీప్ వేరు అని చెప్పింది. మొత్తం మీద పోటుగాళ్ల దెబ్బకు ఆటగాళ్లు తేలిపోతున్నారు. ఇక వీరిని రాబోయే రోజుల్లో పాత కంటెస్టెంట్స్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment