close
Choose your channels

డిజిట‌ల్ మీడియంలోకి త్రిష‌..!!

Wednesday, July 8, 2020 • తెలుగు Comments

డిజిట‌ల్ మీడియంలోకి త్రిష‌..!!

డిజిట‌ల్ మాధ్య‌మానికి ఆడియెన్స్ నుండి ఆద‌ర‌ణ క్ర‌మంగా పెర‌గుతుంది. వెండితెర‌తో పాటు ఓటీటీ కంటెంట్‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తుండ‌టంతో వెండితెర‌పై ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోన్న టాప్‌స్టార్స్‌, టాప్ టెక్నీషియ‌న్స్ డిజిట‌ల్ రంగం వైపు అడుగులేస్తున్నారు. హీరోయిన్స్ విష‌యానికి వ‌స్తే స‌మంత ది ఫ్యామిలీ మేన్ సీజ‌న్ 2లో టెర్రరిస్ట్ పాత్ర‌లో న‌టిస్తే.. త‌మ‌న్నా ఓటీటీలో టాక్‌షోలో పాల్గొంటుంది.శృతిహాస‌న్ హాలీవుడ్ వెబ్ సిరీస్‌లోనూ న‌టించి మెప్పించారు. వీరి బాట‌లోకి మ‌రో స్టార్ హీరోయిన్ మ‌రో స్టార్ హీరోయిన్ అడుగు పెట్ట‌నున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి ఆమె ఎవ‌రో కాదు.. కోలీవుడ్ డ‌స్కీ బ్యూటీ త్రిష‌.

డిజిట‌ల్ మీడియంలోకి త్రిష‌..!!

అటు త‌మిళ ప్రేక్ష‌కులు, ఇటు తెలుగు ప్రేక్ష‌కుల‌నే కాదు హిందీలో ఒక‌ట్రెండు సినిమాల్లో న‌టించి ఆక‌ట్టుకున్న న‌టి త్రిష కృష్ణ‌న్‌. హీరోయిన్‌గా ఆమె కెరీర్ స్టార్ట్ చేసి ప‌దిహేనేళ్లు అవుతున్న‌ప్ప‌టికీ ఇంకా త‌ర‌గ‌ని గ్లామ‌ర్‌తో అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటుంది. ఈ చెన్నై సొగ‌స‌రి ఇప్పుడు డిజిట‌ల్ మీడియంలోకి ఈమె ఎంట్రీ ఖ‌రారైంద‌నే అంటున్నారు. రామ సుబ్ర‌మ‌ణ్య‌న్ అనే డైరెక్ట‌ర్ తెర‌కెక్కించ‌నున్న వెబ్ సిరీస్‌లో త్రిష న‌టింనుంద‌ట‌. తండ్రీ కూతురు మ‌ధ్య సాగే ఎమోష‌న‌ల్ వెబ్ సిరీస్ ఇద‌ని వార్త‌లు విన‌ప‌డుత‌న్నాయి. మ‌రికొన్ని రోజుల్లో దీనిపై మ‌రింత క్లారిటీ రానుంద‌న‌ని టాక్‌.

Get Breaking News Alerts From IndiaGlitz