close
Choose your channels

నిర్మాత‌ల‌కు ‘వ‌కీల్‌సాబ్’ కండీష‌న్స్‌..!

Friday, September 18, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నిర్మాత‌ల‌కు ‘వ‌కీల్‌సాబ్’ కండీష‌న్స్‌..!

జనసేనాని, పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత న‌టిస్తోన్న తొలి చిత్రం ‘వ‌కీల్‌సాబ్‌’. బాలీవుడ్ చిత్రం ‘పింక్‌’కు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప‌వ‌న్ లాయ‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. నివేదా థామ‌స్‌, అంజ‌లి ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కాగా.. కోవిడ్ ప్ర‌భావంతో ఆగిన ఈ సినిమా షూటింగ్‌ను ఈ నెల చివ‌రి వారంలో ప్రారంభించ‌నున్నారు. ప‌వ‌న్‌కల్యాణ్‌ను షూటింగ్‌లో పాల్గొనాల్సిందిగా నిర్మాత‌లు సంప్ర‌దించ‌గా ఆయ‌న వారికి ఓ ష‌ర‌తు పెట్టాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

అదేంటంటే.. ప‌వ‌న్ చాతుర్మాస దీక్ష‌లో ఉన్న కార‌ణంగా సాయంత్రం నాలుగు గంట‌ల వ‌ర‌కే సెట్స్‌లో ఉంటాన‌ని అన్నాడ‌ట‌. అందుకు నిర్మాత‌లు కూడా ఒప్పుకున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ‘వ‌కీల్‌సాబ్’ సినిమా షూటింగ్ ఎన‌భై శాతం పూర్త‌య్యింది. ఈ సినిమాను త్వ‌ర‌గా పూర్తి చేస్తే కానీ.. ప‌వ‌న్ మ‌రో సినిమా సెట్స్‌లోకి వెళ్ల‌లేడు. ఇప్ప‌టికే క్రిష్ జాగర్ల‌మూడి, హ‌రీశ్‌శంక‌ర్‌, సురేంద‌ర్ రెడ్డి, మ‌ధ్యలో అయ్య‌ప్పనుమ్ కోశియుమ్ రీమేక్‌లోనూ ప‌వ‌న్‌న‌టించాల్సి ఉంది. మ‌రి ఈ సినిమాల‌ను ప‌వ‌న్ ఎప్ప‌టికీ పూర్తి చేస్తారోనని ప్రేక్ష‌కాభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.