close
Choose your channels

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘వకీల్‌సాబ్’ పిక్స్..

Thursday, December 17, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాలీవుడ్ సినిమా ‘పింక్‌’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్‌సాబ్’. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. నివేదా థామస్, అంజలి, అనన్యలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌పై ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్‌లో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఒక వీడియో వైరల్ అవుతోంది.

లాక్‌డౌన్ అనంతరం ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తాజా షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను నిజాం కాలేజ్‌లో చిత్రీకరిస్తున్నారు. షూటింగ్‌ నిజాం కాలేజ్‌లో జరుగుతోందని తెలుసుకున్న అభిమానులు.. పవర్ స్టార్‌ని కలిసేందుకు భారీగా సెట్ వద్దకు చేరుకున్నారు. తనను చూసేందుకు వచ్చిన అభిమానులకు పవన్ అభివాదం చేయడమే కాకుండా.. అభిమానులు తీసుకునే ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా..2020కి సంబంధించిన ట్విట్టర్‌ లెక్కలను ఇటీవల ట్విట్టర్‌ ఇండియా బయటపెట్టింది. ఈ క్రమంలోనే ఏ హీరో, హీరోయిన్‌ పేరు బాగా ట్రెండ్‌ అయ్యింది, ఏ సినిమా పేరు టాప్‌ స్థానాన్ని ఆక్రమించిదనే లెక్కలను తాజాగా ట్విట్టర్‌ విడుదల చేసింది. అందులో తెలుగు సినిమా విషయానికి వస్తే.. 'వకీల్‌సాబ్‌' చిత్రం టాప్‌లో నిలిచింది. మోస్ట్ ట్విటెడ్‌ తెలుగు మూవీ ఇన్‌ 2020గా 'వకీల్‌సాబ్‌' చిత్రం టాప్‌ ప్లేస్‌లో నిలిచినట్లుగా ట్విట్టర్‌ ఇండియా ప్రకటించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.