close
Choose your channels

25న వస్తున్న 'చంద్రిక'

Monday, September 21, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఫ్లయింగ్‌ వీల్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై.. యోగేష్‌ దర్శకత్వంలో శ్రీమతి వి.ఆశ నిర్మిస్తున్న హర్రర్‌ డ్రామా ఎంటర్‌టైనర్‌ చంద్రిక`. కార్తీక్‌ జయరామ్‌-కామ్న జెత్మలాని-శ్రీముఖి హీరోహీరోయిన్లుగా రూపొందిన ఈ భారీ బడ్జెట్‌ చిత్రం ఈ నెల 25న విడుదలవుతోంది.

నిర్మాత వి.ఆశ మాట్లాడుతూ... మా దర్శకుడు యోగేష్‌ చంద్రిక` చిత్రాన్ని అత్యద్భుతంగా రూపొందించాడు. సాజిద్‌ ఖురేషి సమకూర్చిన కథ-స్క్రీన్‌ప్లే, అర్టిస్టుల అభినయం, మా మ్యూజిక్‌ డైరెక్టర్‌ గున్వంత్‌సేన్‌ రీరికార్డింగ్‌తోపాటు గ్రాఫిక్స్‌ చంద్రిక` చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. ఈనె 25న విడుదల చేస్తున్నాం` అన్నారు.

చిత్ర దర్శకుడు యోగేష్‌ మాట్లాడుతూ... మా నిర్మాత ఆశ మేడమ్‌ మరియు ఈ చిత్రం కోసం పని చేసిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణలందరి సంపూర్ణ సహాయ సహకారాల వల్ల అద్భుతంగా రూపొందిన చంద్రిక` అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకొంటుందనే నమ్మకం ఉంది` అన్నారు.

గిరీష్‌ కర్నాడ్‌, ఎల్‌.బి.శ్రీరాం, సత్యం రాజేష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కె.రాజేంద్రబాబు, సాహిత్యం: వనమాలి-కరుణాకర్‌ అడిగర్ల, సంగీతం: గున్వంత్‌సేన్‌, కథ-స్క్రీన్‌ప్లే: సాజిద్‌ ఖురేషి, నిర్మాత: వి.ఆశ, దర్శకత్వం: యోగేష్‌!!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.