రజనీ రాకతో వెనక్కి వెళ్లిన వెంకీ..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సంచలన చిత్రం కబాలి. రంజిత్ తెరకెక్కించిన సంచలన చిత్రం కబాలి ఈనెల 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. దీంతో విక్టరీ వెంకటేష్ నటించిన బాబు..బంగారం వెనక్కి వెళ్లింది. మారుతి దర్శకత్వంలో రూపొందిన బాబు బంగారం చిత్రం ఆడియోను ఈనెల 9న, సినిమాను ఈనెల 29న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
అయితే...అనుకోకుండా ఈ నెల 22న రజనీ కబాలి రిలీజ్ అవుతుండడంతో వెంకీ బాబు...బంగారం వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే...బాబు బంగారం ఆడియోను ఈ నెల 20 తర్వాత రిలీజ్ చేసి... ఇక చిత్రాన్ని ఆగష్టులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ విషయాన్ని అఫిషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.