close
Choose your channels

గచ్చిబౌలిలో బిజీ బిజీగా వెంకీ..

Wednesday, June 22, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విక్ట‌రీ వెంక‌టేష్ - యూత్ ఫుల్ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం బాబు బంగారం. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన బాబు బంగారం టీజ‌ర్ కి మంచి రెస్పాన్స్ రావ‌డంతో రోజురోజుకి సినిమా పై ఎక్స్ పెక్టేష‌న్స్ పెరిగిపోతున్నాయి.
ప్ర‌స్తుతం ఈ చిత్రం కోసం హైద‌రాబాద్ గచ్చిబౌలిలో వెంక‌టేష్, న‌య‌న‌తార ఇత‌ర ఆర్టిస్టుల పై క్లైమాక్స్ చిత్రీక‌రిస్తున్నారు. క్లైమాక్స్ పూర్త‌యితే ఒక పాట మినహా షూటింగ్ పూర్త‌యిన‌ట్లే. ఇక మిగిలిన ఆ పాట‌ను హైద‌రాబాద్ లో ప్ర‌త్యేకంగా రూపొందిస్తున్న సెట్ లో చిత్రీక‌రించ‌నున్నార‌ని స‌మాచారం. బాబు బంగారం ఆడియో & ట్రైల‌ర్ ను జులై 9న హైద‌రాబాద్ లో భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. బాబు బంగారం చిత్రాన్ని జులై 29న రిలీజ్ చేయ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.