close
Choose your channels

మహేష్ సినిమాకు సాయం అందించనున్న వెంకీ కుడుముల

Tuesday, May 4, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మహేష్ సినిమాకు సాయం అందించనున్న వెంకీ కుడుముల

‘ఛలో’, ‘భీష్మ’ సినిమాల సక్సెస్ తర్వాత దర్శకుడు వెంకీ కుడుముల నెక్ట్స్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. తరువాత ఓ స్టార్ హీరోతో సినిమా రూపొందించేందుకు వెంకీ ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను టాప్ ప్రొడ్యూసర్ ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. రాధాకృష్ణ, వెంకీ కుడుముల కాంబోలోనే భీష్మ మూవీ తెరకెక్కింది. ఈ పరిచయంతోనే వెంకీని డైరెక్టర్ త్రివిక్రమ్‌కు సహాయం చేయాలని రాధాకృష్ణ కోరారట.

Also Read: ప్రభాస్‌తో కలిసి స్టెప్పులేసేందుకు సిద్ధమైన ‘కేజీఎఫ్’ బ్యూటీ

ప్రస్తుతం వెంకీకి తన సొంత ప్రాజెక్టును రూపొందించేందుకు సమయం పట్టే అవకాశం ఉండటంతో త్రివిక్రమ్‌కు సాయం అందించేందుకు ఒప్పుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వెంకి కుడుముల త్రివిక్రమ్‌కు దర్శకత్వ అంశాలలో సహాయపడటమే కాకుండా, స్క్రిప్ట్‌ను రూపొందించడంలో తన సహకారాన్ని అందించనున్నట్టు తెలిసింది. రాధాకృష్ణ.. వెంకీని సాయం అడగటానికి మరో కారణం కూడా ఉంది. త్రివిక్రమ్ సినిమాల కోసం పని చేసిన సీనియర్ కో డైరెక్టర్ సత్యం ఇటీవలే మరణించారు. సత్యం సెట్స్‌‌కి వెళ్లి నాన్ తెలుగు నటీమణులకు డైలాగ్ డెలివరీలో సాయం అందించేవారు. సత్యం లేని లోటును వెంకీ చక్కగా భర్తీ చేయగలరని రాధాకృష్ణ నమ్ముతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos