close
Choose your channels

మురళీధరన్ బయోపిక్‌లో విజ‌య్ సేతుప‌తి

Thursday, October 8, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మురళీధరన్ బయోపిక్‌లో విజ‌య్ సేతుప‌తి

ఇండియ‌న్ సినిమాలో బ‌యోపిక్స్ హ‌వా న‌డుస్తోంది. తాజాగా మ‌రో బయోపిక్ క‌న్‌ఫ‌ర్మ్ అయ్యింది. శ్రీలంకన్ క్రికెట‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ జీవితం ఆధారంగా తెర‌కెక్క‌నున్న బ‌యోపిక్‌లో విజ‌య్ సేతుప‌తి నటిస్తార‌ని వార్త‌లు వినిపిస్తూ వ‌చ్చాయి. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఎం.ఎస్‌.శ్రీప‌తి ద‌ర్శ‌క‌త్వంలో మూవీ ట్రెయిన్ మోష‌న్ పిక్చ‌ర్స్‌, దార్ మోష‌న్ పిక్చ‌ర్స్ పతాకాల‌పై సినిమా రూపొంద‌నుంది. ముర‌ళీధ‌ర‌న్ పాత్ర‌లో విజ‌య్ సేతుప‌తి న‌టించ‌నున్న‌ట్లు నిర్మాత‌లుక‌న్‌ఫ‌ర్మ్ చేశారు.

టెస్ట్ క్రికెట్‌లో 800 వికెట్లు, వ‌న్డేల్లో 534 వికెట్లు తీసి రికార్డ్ క్రియేట్ చేశాడు. 2011 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైనల్ త‌ర్వాత ముర‌ళీధ‌ర‌న్ రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు. ఈ బ‌యోపిక్‌కి ‘800’ అనే టైటిల్ పెట్ట‌బోతున్నారు. ప్ర‌స్తుతం ఈయ‌న స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బౌలింగ్ కోచ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్ప‌టికే ముర‌ళీధ‌ర‌న్ స్టైల్ ఆఫ్ బౌలింగ్ యాక్ష‌న్‌ను విజ‌య్‌సేతుప‌తి నేర్చుకుంటున్నాడ‌ని టాక్‌. ఇది కాకుండా తెలుగులో ఉప్పెన, బాలీవుడ్‌లో లాల్ సింగ్ చద్దా చిత్రాలతో పాటు తమిళంలో ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు విజయ్ సేతుపతి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.