close
Choose your channels

Vikkatakavi :తెలంగాణ డిటెక్టివ్ నేపథ్యంలో 'వికటకవి' వెబ్‌సిరీస్.. త్వరలోనే జీ5లో స్ట్రీమింగ్..

Wednesday, April 10, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగువారికే కాదు అన్ని భాషల వారికి వైవిధ్యమైన కథలను అందించడంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పటికే అనేక చిత్రాలను, వెబ్‌సిరీస్‌లను ప్రేక్షకులకు అందించిన జీ5.. తాజాగా ‘వికటకవి’ అనే సరికొత్త వెబ్ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేయనుంది. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సిరీస్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మిస్తుండగా.. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న మొట్టమొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ ఇదే కావటం విశేషం.

హైదరాబాద్ విలీనం తర్వాత నల్లమల అటవీ ప్రాంతంలోని ‘అమరగిరి’ అనే గ్రామాన్ని 30 ఏళ్లుగా ఓ శాపం పట్టి పీడిస్తుంటుంది. అలాంటి అమరగిరి గ్రామానికి డిటెక్టివ్ రామకృష్ణ వెళతాడు. అంతే కాకుండా ఆ గ్రామానికి సంబంధించిన పురాతన కథలను, అధునిక కుట్రల వెనకున్న రహస్యాలను అతను వెలికితీస్తాడు. శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణంలో నీటిమట్టం పెరిగి కొన్ని సత్యాలు కనుమరుగైపోతాయి. దానికి సంబంధించిన వివరాలు ఎవరికీ తెలియని రహస్యాలుగా మిగిలిపోతాయి. దాన్ని చేధించటానికి డిటెక్టివ్ రామకృష్ణ కాలానికి వ్యతిరేకంగా పోరాడుతాడు. ఈ ప్రయాణంలో తనకు ఎదురయ్యే సవాళ్లు ఏంటి? అనేది తెలుసుకోవాలంటే ‘వికటకవి’ సిరీస్ చూడాల్సిందే అని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటివరకు రానటువంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వికటకవి సిరీస్ రూపొందిస్తున్నారు.

నటీనటులు: నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్, సిజ్జు అబ్దుల్ రషీద్, తారక్ పొన్నప్ప, రమ్యా రామకృష్ణన్, రఘు కుంచె, రషా కిర్మాణి, అమిత్ తివారి, రవితేజ నన్నిమల, గిరిధర్, సంతోష్ యాదవ్, సాయి ప్రసన్న, అశోక్ కుమార్.కె తదితరులు

సాంకేతిక వర్గం: బ్యానర్ - ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాత - రామ్ తాళ్లూరి, దర్శకత్వం - ప్రదీప్ మద్దాలి, కథ, కథనం, మాటలు - తేజ దేశ్‌రాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - విద్యాసాగర్.జె, సినిమాటోగ్రఫీ - షోయబ్ సిద్ధికీ, ఎడిటర్ - సాయిబాబు తలారి, మ్యూజిక్ - అజయ్ అరసాడ, ఆర్ట్ - కిరణ్ మామిడి, ఫైట్స్ - వింగ్ చున్ అంజి, కాస్యూమ్స్ - జె.గాయత్రీ దేవి, కో డైరెక్టర్ - హెచ్.శ్రీనివాస్ దొర, చీఫ్ అసిసోయేట్ - రాజ్ కుమార్ కూసానా, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ - సుధాకర్ ఉప్పాల (సూర్య).

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.