కాబోయే అమ్మాయితో విశాల్.. పెళ్లేప్పుడంటే...
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగువాడైన తమిళ హీరో..నిర్మాతల సంఘం అధ్యక్షుడు.. నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ త్వరలోనే వివాహం చేసుకోనున్నారు. హైదరాబాద్కు చెందిన బిజినెస్మేన్ కుమార్తె అనీషా రెడ్డిని ఫిబ్రవరి లేదా మార్చిలో చెన్నైలోని నడిగర్ సంఘం భవనంలో పెళ్లి చేసుకోబోతున్నారని సినీ వర్గాల కథనం.
రీసెంట్గా విశాల్ వర్గీయులు విశాల్ పెళ్లి గురించి వార్తలను ఖండించినా.. మీడియాలో ఆయన పెళ్లి గురించిన వార్తలు ఆగలేదు. సరికదా.. ఇప్పుడు ఆయన తనకు కాబోయే అమ్మాయితో ఉన్న ఫోటో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
నడిగర్ సంఘం భవనం పూర్తి చేసిన తర్వాతే తన పెళ్లి అని ఇది వరకు ప్రకటించిన విశాల్.. అన్నట్లుగానే నడిగర్ సంఘం భవనంలోనే పెళ్లి చేసుకోబోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.