మార్చి నెలాఖరులో 'ఏప్రిల్ 28 ఏం జరిగింది?' విడుదల


Send us your feedback to audioarticles@vaarta.com


సరికొత్త కథాంశంతో జనరంజకమైన అంశాలతో రూపొందే సినిమాలను తెలుగు ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. వైవిధ్యాన్ని ఆదరించే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా మా చిత్రానికి కూడా విజయాన్ని అందిస్తారని నమ్ముతున్నానుఅన్నారు దర్శకుడు వీర గనమాల. రంజిత్, షెర్రీ అగర్వాల్ జంటగా వీజీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఆయన స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ఏప్రిల్ 28 ఏం జరిగింది.టైటిల్‌తోనే ఆసక్తిని కలిగించిన ఈ చిత్రం ఇటీవల విడుదల చేసిన టీజర్‌తో ప్రేక్షకుల్లోమరింత ఉత్కంఠను రేపింది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ
ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. నేటి తరం ప్రేక్షకులు మెచ్చే ఓ వినూత్నమైన కథతో, ఎవరూ అంచనా వేయలేని ట్విస్ట్‌లతో అనుక్షణం ఉత్కంఠగా సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. స్క్రీన్‌ప్లే ప్రధానంగా కొనసాగే ఈ చిత్రంలో ప్రతి మలుపు ఆసక్తికరంగా థ్రిల్లింగ్‌గా వుంటుంది. త్వరలో బ్యాంకాంక్‌లో జరిగే పాట చిత్రీకరణతో చిత్రం పూర్తవుతుంది. మార్చి నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు. అజయ్, రాజీవ్‌కనకాల, తనికెళ్లభరణి, చమ్మక్‌చంద్ర, తోటపల్లి మధు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సందీప్, కెమెరా: సునీల్‌కుమార్ ఎన్, స్క్రీన్‌ప్లే: హరిప్రసాద్ జక్కా, మాటలు, పాటలు: ధర్మతేజ, రామాంజనేయులు, ఎడిటర్:కె.సంతోష్, కథ-మాటలు-దర్శకత్వం: వీర గనమాల
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments