close
Choose your channels

చంద్రబాబు బీసీలను వాడుకుంటే.. సీఎం జగన్ అక్కున చేర్చుకున్నారు..

Wednesday, March 6, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చంద్రబాబు బీసీలను వాడుకుంటే.. సీఎం జగన్ అక్కున చేర్చుకున్నారు..

దివంగత సీఎం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గరి నుంచి బడుగు, బలహీన వర్గాలకు మద్దతుగా నిలిచేశారు. ఆయన హయంలో ఎంతో మంది బీసీలు, ఎస్సీలు, నిమ్న కులాలకు చెందన వారు చట్టసభల్లో అడుగుపెట్టేవారు. దీంతో టీడీపీ అంటే వెనుకబడిన వర్గాల పార్టీగా ముద్రపడింది. ఈ నేపథ్యంలో ఆ వర్గాలు కూడా టీడీపీకి అండగా నిలిచాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఎన్టీఆర్ మరణానంతరం చంద్రబాబు పార్టీ అధ్యక్ష పదవులు చేపట్టాక పరిస్థితి మాత్రం మారిపోయింది. బీసీలను దూరంగా పెడుతూ కేవలం డబ్బులున్న పెత్తందార్లుకే మాత్రమే పదవులు కట్టబెట్టారని ఆ వర్గాల నాయకులే చెబుతూ ఉంటారు.

ఎన్నికలు వస్తేనే బీసీలు గుర్తుకు వస్తారు..

కానీ ఎన్నికలు వచ్చాక మాత్రం చంద్రబాబుకు బీసీలు భలే గుర్తుకు వస్తుంటారు. ఎన్నికలు రాగానే బీసీలు.. ఎస్సీలు... ఎస్టీలు అని కొత్త రాగాలు అందుకుంటారు. అదంతా ఎన్నికలు వరకే.. అయిపోగానే.. పదవులు.. పోస్టింగులు అన్నీ తమ కులాల వాళ్ళకు లేదా తమకు ఆర్థికంగా అండదండలు ఇచ్చినవాళ్లకు మాత్రమే ఇచ్చుకుంటారు. ఇది ఒకసారి కాదు.. చంద్రబాబు పదే పదే చెప్పేది అదే... చేసేది కూడా ఇదే.. ఒకసారి బీసీలకు ఎవరు ఎంత మద్దతుగా నిలిచారో ప్రజలు తెలుసుకోవాలి.

చంద్రబాబు బీసీలను వాడుకుంటే.. సీఎం జగన్ అక్కున చేర్చుకున్నారు..

బీసీలు జడ్జిలుగా పనికిరారని లేఖలు..

బీసీలు జడ్జీలుగా పనికిరారని నాటి సీఎంగా ఉన్న చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. అలాగే నాయీబ్రాహ్మణులకు తోకలు కత్తిరిస్తా,మత్స్యకారులకు తోలు తీస్తానని కాసురుకున్నది కూడా చంద్రబాబే. అదే సీఎం వైయస్ జగన్ అయితే స్థానిక సంస్థల పదవుల్లో బీసీలకు 34 శాతం పదవులు కేటాయిస్తూ 2019 డిసెంబరు 28న జీవో జారీ చేసి వారికి పదవుల్లో చట్టబద్ధమైన వాటా ఇచ్చారు. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ బాబు ఆదేశాల మేరకు టీడీపీ నేత బిర్రు ప్రతాప్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి 2019 మార్చి 9న చంద్రబాబు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం అమలు తీరు పర్యవేక్షించే రాష్ట్ర కౌన్సిల్‌(APSEGC) సభ్యుడిగా బిర్రు ప్రతాప్ రెడ్డిని నియమించింది. ఈ కేసు దెబ్బతో జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోను నిలుపుదల చేసిన సుప్రీంకోర్టు మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికే పరిమితం చేసింది.

బీసీలంటే బ్యాక్‌ వర్డ్‌ క్లాస్‌ కాదు.. బీసీలంటే దేశానికి బ్యాక్‌ బోన్‌ అని ప్రకటించారు సీఎం జగన్. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత డీబీటీ (నగదు బదిలీ) ద్వారా రూ.1.15 లక్షల కోట్లు బీసీల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. నగదేతర బదిలీ ద్వారా రూ.50,321.88 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా రూ.1.65 లక్షల కోట్ల మేర బీసీలకు ప్రయోజనం చేకూర్చారు.

చంద్రబాబు బీసీలను వాడుకుంటే.. సీఎం జగన్ అక్కున చేర్చుకున్నారు..

కీలక పదవుల్లో బీసీలు..

జగన్‌ ప్రభుత్వంలో బీసీ మంత్రులు–11
(బాబు హయాంలో–8)

జగన్‌ ప్రభుత్వంలో రాజ్యసభ సీట్లు–4
(బాబు హయాంలో గత 5 ఏళ్లలో–సున్నా)

జగన్‌ ప్రభుత్వంలో స్పీకర్- తమ్మినేని సీతారాం(బీసీ)
బాబు హయాంలో స్పీకర్- కోడెల శివప్రసాద్ (చౌదరి)

జగన్ హయాంలో..

• ఎమ్మెల్యేలు–౩0
• ఎమ్మెల్సీలు–19
• కార్పొరేషన్లు–56
• మేయర్‌ పదవులు–9
• మున్సిపల్‌ చైర్మన్లు–98
• జడ్పీ చైర్మన్లు–9
• జడ్పీటీసీలు–215

ఇది కాకుండా టీడీపీ నుంచి గత ఎన్డీయే హయాంలో వచ్చిన ఇద్దరు కేంద్ర మంత్రులుగా అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలను నియమించారు. ఇందులో సుజనా చౌదరి అయితే బ్యాంకులకు ఏకంగా 6వేల కోట్ల రూపాయలు ఎగవేశారనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే చంద్రబాబు ప్రభుత్వంలో కంటే జగన్ ప్రభుత్వంలోనే బీసీలకు న్యాయం జరిగిందని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు. కానీ ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చే సరికి బీసీలను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు కొత్త పన్నాగాలకు తెరదీశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos