close
Choose your channels

మ‌రోసారి ర‌వితేజ‌తో..

Monday, December 4, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మాస్ మ‌హారాజ్‌ ర‌వితేజ‌కి ఇటీవ‌ల కాలంలో బాగా క‌లిసొచ్చిన సంగీత ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే.. మ‌రో మాట లేకుండా చెప్ప‌గ‌లిగే పేరు త‌మ‌న్ అని. కిక్‌తో మొద‌లైన ఈ ఇద్ద‌రి ప్ర‌యాణం ఆ త‌రువాత ఆంజ‌నేయులు, మిర‌ప‌కాయ్‌, వీర‌, నిప్పు, బ‌లుపు, ప‌వ‌ర్‌, కిక్ 2 వ‌ర‌కు కొన‌సాగింది. అంటే.. కిక్ చిత్రంతో వీరి జ‌ర్నీ మొద‌లైతే.. ఆ సినిమా సీక్వెల్ కిక్‌2 తో ఈ కాంబినేష‌న్‌కి బ్రేక్ ప‌డింద‌న్న‌మాట‌.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. వీరి క‌ల‌యిక‌లో తొమ్మిదో సినిమా రాబోతుందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ర‌వితేజ‌, శ్రీ‌నువైట్ల కాంబినేష‌న్ లో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడిగా త‌మ‌న్ క‌న్‌ఫ‌ర్మ్ అయ్యాడని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

వ‌చ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ చిత్రంలో కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశ‌ముంది. శ్రీ‌నువైట్ల‌, త‌మ‌న్‌ది హిట్ కాంబినేష‌న్ నే. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో దూకుడు, బాద్ షా వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాలు వ‌చ్చాయి. అయితే ఆ త‌రువాత వ‌చ్చిన ఆగ‌డు, బ్రూస్‌లీ ఆశించిన విజ‌యం సాధించ‌లేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.