Ram Charan:ఉమెన్స్ డే స్పెషల్.. తల్లితో కలిసి వంట చేసిన రామ్‌చరణ్..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఖాళీ సమయాల్లో ఇంట్లో పనులు చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు వంట కూడా వండుతూ తనలోని కుకింగ్ స్కిల్స్ బయటపెడతాడు. తాజాగా మహిళ దినోత్సవం సందర్భంగా తన తల్లి సురేఖకు వంటలో సాయం చేస్తూ కనిపించాడు. దీనిని భార్య ఉపాసన వీడియో తీసింది.
ఈ వీడియోలో ఉపాసన వచ్చి.. "అత్తమ్మ గారండీ ఈ రోజు మీ కిచెన్‌లో ఏం అవుతుంది అంటే.. సురేఖ.. ఏమవుతుంది, దోస అయితుంది.. నా కొడుకు నా కోసం వండుతున్నాడు. ఉమెన్స్ డే అని ఇవాళ తనే మనకు వండుతున్నాడు అని చెప్పింది. దీంతో ఉపాసన.. రోజూ ఉమెన్స్ డే ఉంటే బాగుండు అంటుంది.. ఇక చరణ్ వంట చేస్తుంటే ఏం వండుతున్నావు అని అడగ్గా.. దోస, పన్నీర్ టిక్కా మా అమ్మ కోసం" అని చెప్పాడు. ఈ వీడియోను ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.
కాగా ఇటీవల తన సతీమణి ఉపాసన పాదాలకు చెర్రీ మసాజ్ చేసిన వీడియో పెద్ద ఎత్తున అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియో చూసిన మహిళా అభిమానులు.. చెర్రీ ఆదర్శ భర్త అని, బెస్ట్ హజ్బెండ్ అవార్డు ఇచ్చేయాలని కామెంట్లు పెడుతున్నారు. అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రివెడ్డింగ్ వేడుకకు చెర్రీ, ఉపాసన దంపతులు ఓ ప్రైవేట్ జెట్‌లో జామ్‌నగర్ బయలుదేరి వెళ్లారు. ఈ సమయంలో ఉపాసన నిద్రపోతుండగా.. ఆమె పాదాలకు మసాజ్ చేస్తూ ఉన్నాడు. దీనిని చెర్రీ అసిస్టెంట్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు చరణ్ సింప్లిసిటీని మెచ్చుకుంటున్నారు.
అంత పెద్ద స్టార్ హీరో అయి ఉండి భార్య పాదాలు పట్టుకోవడం గ్రేట్ అని కొనియాడుతున్నారు. ఎంతటి వారైనా సరే భార్యకు సేవలు చేయాల్సిందేనని కామెంట్స్ చేస్తున్నారు. గతంలోనూ RRR ప్రమోషన్స్ కోసం అమెరికా వెళ్ళినప్పుడు షాపింగ్ వెళితే ఉపాసన బ్యాగులు మోయడం.. ఇంట్లో వంట చేసేటప్పుడు సాయం చేయడం చేస్తూ ఉంటాడు. వీరి అన్యోన్యమైన దాంపత్యానికి ఇలాంటి వీడియోలే నిదర్శమని చెబుతున్నారు.
ఇక చరణ్ సినిమాల విషయానికొస్తే RRR మూవీతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్నాడు. దీంతో తన తర్వాతి చిత్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' అనే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు. ఇప్పటికే 80శాతంకు పైగా షూటింగ్ కంప్లీట్ అయింది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీలో చెర్రీ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఎంపిక కాగా.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నాడు.
• @AlwaysRamCharan #WomensDay Special for Surekha garu ❤️😅 pic.twitter.com/TAMShNr1dT
— Trends RamCharan ™ (@TweetRamCharan) March 8, 2024
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments