close
Choose your channels

Yedi Nijam Naa Preyasi: 'ఏది నిజం నా ప్రేయసి' ఆల్బమ్ సాంగ్ చిత్రీకరణ

Tuesday, November 8, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వెండితెరపై కోట్లు ఖర్చుపెట్టి సెట్లు వేసి, హంగులు ఆర్భాటలతో డైరెక్టర్లు ఒక పాటను చిత్రీకరిస్తారు. దానికి ఏ మాత్రం తీసిపోకుండా... ఖర్చుకు వెనకాడకుండా అద్భుతమైన విజువల్స్ తో ఒక ఆల్బమ్ సాంగ్ ని మన తెలుగు యువదర్శకుడు తెరకెక్కించారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇలాంటి తరహా ఆల్బమ్ సాంగ్స్ హాలీవుడ్ లో తీస్తుంటారు. మనదగ్గర చాలా అరుదు.
యువదర్శకుడు వివేక్ కైపా పట్టాబిరామ్ దర్శకత్వం వహించిన 'ఏదీ నిజమ్ నా ప్రేయసి' అనే ద్విభాషా (తమిళం-తెలుగు) ప్రయోగాత్మక కాన్సెప్ట్ ఆల్బమ్ పాట ఇప్పుడు విశేషప్రజాదరణ పొందుతుంది. అంతే కాకుండా ఇటు తెలుగు అటు తమిళ ఇండస్ట్రీ దిగ్గజాలలో ఈ పాట చర్చినీయాంశం అవుతుంది అంటే ఈ ఆల్బమ్ సాంగ్ ఎంతలా ఆకట్టుకుంటుందో అర్థం అవుతుంది.

యువ ప్రతిభను ప్రోత్సహించే వసంత్ రామసామి ఈ పాటను నిర్మించగా, మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ అన్నాద్ సంగీతం స్వరపరిచారు. ఈ ప్రైవేట్ ఆల్బమ్ పాటను గోవా, చెన్నై లోని అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరించారు. అంతే కాకుండా తెలుగులో ఆల్బమ్ సాంగ్ లో ఎన్నడూ చూడనివిదంగా గ్రాండ్ విజువల్స్ తో పాటు ఆకట్టుకునే గ్రాఫిక్స్ తో కూడిన విభిన్నమైన కాన్సెప్ట్‌ కలిగిన సాంగ్ ఇది. గ్రాఫిక్స్ అంటేనే ఖర్చుతో కూడిన వ్యవహారం అయినప్పటికీ దర్శకుడు ఎక్కడ తగ్గకుండా ఆల్బమ్ సాంగ్ కు కావల్సిన గ్రాఫిక్స్ తో అద్భుతంగా చిత్రీకరించారు. ప్రస్తుతం నాణ్యత లేకుండా ఎలాంటి కాన్సెప్ట్ లేకుండా రెగ్యులర్ డ్యాన్స్ లతో వస్తున్న సాంగ్స్ కు ఈ పాట సవాల్ గా నిలుస్తోంది.

దర్శకుడు వివేక్ కెపి ఇంతకు ముందు తెలుగు/తమిళ సినిమాలు, టీవీ కమర్షియల్స్‌లో అసోసిట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అదేవిధంగా కొన్ని వాణిజ్య ప్రకటనలు, ఆల్బమ్ పాటలకు దర్శకత్వం వహించారు. సినిమా విజువల్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా పాటల్లో విజువల్ స్టోరీ టెల్లింగ్ చెప్పడం డైరెక్టర్ వివేక్ ప్రత్యేకత.

హీరో విశ్వంత్ దుడ్డుంపూడి ఈ పాటలో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, తమిళ నటి మేఘాలి మీనాక్షి, బాలీవుడ్ నటి జోయితా చతీర్జే, టాప్ ముంబై మోడల్ జిన్నాల్ జోషి, తెలుగు అమ్మాయి యషు మాశెట్టి నటించారు. ఈ ఆల్బమ్ కి బిచ్చగాడు ఫేమ్ డిఓపి ప్రసన్న కుమార్, మరో డిఓపి వినోద్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. విశాల్ డిటెక్టివ్ సినిమా ఫేమ్ అరుణ్ కుమార్ ఎడిటర్ గా వ్యవహరించగా, కరుణాకర్ అడిగర్ల ఈ పాటకు లిరిక్స్ అందించారు. చిన్మయి శ్రీపాద, యాజిన్ నిజార్ తెలుగులో పాడగా, హరిచరణ్ తమిళ వెర్షన్‌ కి పడ్డారు. రూమా జైన్ స్టైలిస్ట్ డిజైనర్ గా పని చేశారు.

మనకు నచ్చినపనిని ఇష్టంతో పిచ్చిగా చేయటాన్ని మనం ప్యాషన్ అంటే అదే ప్యాషన్ తో అందరి దృష్టిని ఆకట్టుకునేలా అద్భుతమైన గ్రాఫిక్స్ తో తెరకెక్కించిన ఏది నిజం నా ప్రేయసి ఆల్బమ్ సాంగ్ ఇప్పుడే జెయింట్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రతిభ కలిగిన యువదర్శకుడు వివేక్ కైపా పట్టాభిరాం త్వరలోనే ఒక పూర్తిస్థాయి సినిమాతో మనముందుకు రావాలని ఆశిద్దాం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Login to post comment
Cancel
Comment