close
Choose your channels

MLC Elections : నాలుగు స్థానిక సంస్థల కోటా స్థానాల్లో వైసీపీ ఘన విజయం.. !!

Thursday, March 16, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 4 స్థానాల్లో అధికార పార్టీ ఘన విజయం సాధించింది. తగిన సంఖ్యాబలం లేకపోయినప్పటికీ బరిలోకి నిలిచిన తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఫలితాల్లో వైసీపీ అభ్యర్ధి నర్తు రామారావు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో 752 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఓటు వేయగా.. రామారావుకు 632, స్వతంత్ర అభ్యర్ధి ఆనేపు రామకృష్ణకు 108 ఓట్లు వచ్చాయి.

పశ్చిమలో రెండు, కర్నూలులో ఒక స్థానం :

ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్ధులే గెలిచారు. వైసీపీ అభ్యర్ధులు కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్‌లు విజయం సాధించారు. కవురుకు 481 ఓట్లు, వంకా రవీంద్రనాథ్‌కు 460 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి నిలిచిన వీరవల్లి చంద్రశేఖర్‌కు 120 ఓట్లు పోలయ్యాయి. అలాగే కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి డాక్టర్ మధుసూదన్ గెలుపొందారు. ఆయనకు 988 ఓట్లు.. స్వతంత్ర అభ్యర్ధి మోహన్ రెడ్డికి 85 ఓట్లు వచ్చాయి. కాగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాలకు చెందిన 5 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమై వైసీపీ ఖాతాలో పడ్డాయి.

ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ స్థానం ఫలితానికి 48 గంటలు :

మరోవైపు.. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలు.. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. అయితే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుకు 48 గంటలు పడుతుందని అధికారులు అంటున్నారు. ఇక్కడ ఆరు జిల్లాల పరిధిలోని 2 లక్షలకు పైగా ఓట్లు వేశారు. విశాఖలోని స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో 500 మంది ఎన్నికల సిబ్బంది విడతల వారిగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అటు పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు అనంతపురంలోని జేఎన్టీయూలో కొనసాగుతోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.