close
Choose your channels

శివబాలాజీ 'స్నేహమేరా జీవితం' 80 శాతం పూర్తి...

Saturday, December 12, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శివ బాలాజీ హీరోగా న‌టిస్తూ నిర్మిస్తున్న చిత్రం స్నేహ‌మేరా జీవితం. ధన్ విన్ కాంగుల సమర్పణలో గగన్ మ్యాజికల్ ఫ్రేమ్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చితం పడ్డానండీ ప్రేమలో మరి`వంటి క్యూట్ లవ్ స్టోరీని రూపొందించిన దర్శకుడు మహేష్ ఉప్పుటూరి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ప్ర‌స్తుతం సినిమా 80 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది.

1980 బ్యాక్ డ్రాప్ లో ఒక నిజ ఘటనను ఆధారంగా చేసుకుని, ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథే ఈ సినిమా. ఇందులో ప్రేక్షకులు కోరుకునే ఎలిమెంట్స్ అన్నీఉంటాయి. ఈ చిత్రంలో శివబాలాజీతో పాటు ప్రముఖ నటుడు రాజీవ్ క‌న‌కాల కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. శివ‌బాలాజీ స‌ర‌స‌న యు.ఎస్‌కు చెందిన తెలుగు అమ్మాయి, క్లాసిక‌ల్ డ్యాన్సర్ సుష్మ యార్ల‌గ‌డ్డ హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ నెల‌లోనే సినిమా చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్త‌వుతుంద‌ని, సునీల్ కశ్యప్ అద్భుతమైన సంగీతం, భరణి కె.ధరణ్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని దర్శక నిర్మాతలు తెలియజేశారు.

శివబాలాజీ, రాజీవ్ కనకాల, సుష్మ యార్లగడ్డ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: ధన్ విన్, కెమెరా: భరణి కె.ధరణ్, మ్యూజిక్: సునీల్ కశ్యప్, మాటలు: కిట్టు విస్సా ప్రగడ, కథా విస్తరణ: విద్యాసాగర్ రాచకొండ, పాటలు: బాలాజీ, చైతన్య వర్మ,నిర్మాత: శివబాలాజీ మనోహరన్, దర్శకత్వం: మహేష్ ఉప్పుటూరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.