close
Choose your channels

అమెరికా లో బ్రహ్మానందం కి అరుదైన గౌరవం

Tuesday, October 3, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అక్టోబర్ 6న అమెరికా లోని సియాటెల్ నగరం లో జరుగబోవు తస్వీర్ 12 వ సౌత్ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి గౌరవ అతిధిగా రెడ్ కార్పెట్ స్వాగతం అందుకోమని ప్రముఖ నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత , వెయ్యి చిత్రాలతో గిన్నిస్ బుక్ లో పేరు నమోదు చేసిన డాక్టర్ బ్రహ్మానందం కి ఆహ్వానం అందింది. ఇదే వేదిక పై అక్టోబర్ 7న యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సౌత్ ఏషియా సెంటర్ బ్రహ్మానందం ని ఘనంగా సన్మానించనుంది .

ఇప్పటి వరకు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఈ గౌరవాన్ని పొందిన రెండో నటుడు ఎస్వీ రంగారావు తర్వాత బ్రహ్మానందం మాత్రమే . 1964 జకార్తా చిత్రోత్సవాల్లో నర్తన శాల చిత్రానికి గాను ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ గా ఎస్వీఆర్ అవార్డు పొందిన తర్వాత తిరిగి ఇన్నేళ్లకు ఒక తెలుగు నటుడి విశేష ప్రతిభకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కడం ముదావహం . బాహుబలి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా తెలుగు కళాకారుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తోందనడానికి ఇది ఒక ఉదాహరణ .

ప్రస్తుతం ఆచారి అమెరికా యాత్ర షూటింగ్ నిమిత్తం అమెరికా లోనే షూటింగ్ లో ఉన్న బ్రహ్మానందం ఈ ఆహ్వానానికి అంగీకారం తెలిపారు. నిన్ను కోరి చిత్రం తర్వాత ఆచారి అమెరికా యాత్ర చిత్రానికి అమెరికా లో లైన్ ప్రొడక్షన్ చేస్తున్న పీపుల్ మీడియా సంస్థ అధినేత శ్రీ టీ జీ విశ్వ ప్రసాద్ మీడియా కు ఈ వార్త తెలియ జేస్తూ తమ హర్షాన్ని ప్రకటించారు. తెలుగు వాడి పెదవులపై చెరగని చిర్నవ్వు మన బ్రహ్మానందం గారని , ఇటువంటి ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలకు వారు అర్హుడని కొనియాడారు .

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.