close
Choose your channels

ఫారెన్సిక్ డాక్టర్ గా థ్రిల్ చేయబోతున్న ఆది సాయికుమార్

Monday, December 23, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హీరో ఆది సాయికుమార్ కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు . పుట్టిన రోజు సందర్భంగా కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కబోతున్న చిత్రం కాన్సెప్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర
యూనిట్. అవుట్ అండ్ అవుట్ క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళ బోయే ఈ థ్రిల్లర్ లో ఆది ఒక ఫారెన్సిక్ డాక్టర్ గా థ్రిల్ చేయబోతు్న్నాడు. మరుధూరి ఎంటర్ టైన్మెంట్స్, చాగంటి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రంలో ఆది ఒక కొత్త్ పాత్రలో పరిచయం కాబోతున్నాడు.

శివ శంకర్ దేవ్ ఈ చిత్రం తో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఆద్యంతం ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే అంశాలతో స్ర్కిప్ట్ ని పకడ్బందీగా రెడీ చేసిన దర్శకుడు శివ శంకర్ దేవ్ ఈ చిత్రంలో ఇప్పటి వరకూ తెలుగులో రాని కొత్త కాన్సెప్ట్ ని తెరమీద చూపించబోతున్నాడు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళే ఈ చిత్రంలోని ఇతర పాత్రల వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.