close
Choose your channels

జూన్‌ 3న ప్రభుదేవా, తమన్నా ల 'అభినేత్రి' ఫస్ట్‌ లుక్‌

Tuesday, May 24, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

70 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రభుదేవా, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'అభినేత్రి'. కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌, బి.ఎల్‌.ఎన్‌. సినిమాతో కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తుండగా, ప్రభుదేవా స్టూడియోస్‌ పతాకంపై తమిళ్‌, హిందీ భాషల్లో ప్రభుదేవా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ప్రభుదేవా ఇంట్రడక్షన్‌ సాంగ్‌ను రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసిన భారీ సెట్స్‌లో ఇటీవల చాలా గ్రాండ్‌గా పిక్చరైజ్‌ చేశారు. ఈ పాటలో ఎమీ జాక్సన్‌ ఓ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా కనిపిస్తుంది.

కింగ్‌ ఆఫ్‌ డాన్స్‌ ప్రభుదేవా ఈజ్‌ బ్యాక్‌

ఈ సందర్భంగా కోన ఫిలిం కార్పొరేషన్‌ బేనర్‌లో ఈ చిత్రాన్ని సమర్పిస్తున్న స్టార్‌ రైటర్‌ కోన వెంకట్‌ మాట్లాడుతూ - ''తన డాన్స్‌తో అందర్నీ మెస్మరైజ్‌ చేసిన కింగ్‌ ఆఫ్‌ డాన్స్‌ ప్రభుదేవా దాదాపు పదేళ్ళ తర్వాత మళ్ళీ హీరోగా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల భారీ లెవల్‌లో చిత్రీకరించిన ప్రభుదేవా ఇంట్రడక్షన్‌ సాంగ్‌ పల్లవి వీడియోను జూన్‌ 3న విడుదల చేయబోతున్నాం. కింగ్‌ ఆఫ్‌ డాన్స్‌ ఈజ్‌ బ్యాక్‌ అనిపించేలా ప్రభుదేవా వేసిన స్టెప్స్‌ అందర్నీ ఉర్రూతలూగిస్తాయి. అదేరోజు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని కూడా రిలీజ్‌ చేస్తున్నాం. ఈ ఫంక్షన్‌కి సర్‌ప్రైజింగ్‌ గెస్టులు హాజరు కాబోతున్నారు. ఆ సర్‌ప్రైజింగ్‌ గెస్టులు ఎవరన్నది అదేరోజు తెలుస్తుంది'' అన్నారు.

నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ - ''ఫస్ట్‌ టైమ్‌ టైటిల్‌ రోల్‌ ప్లే చేస్తున్న తమన్నా చాలా ఎక్స్‌లెంట్‌గా పెర్‌ఫార్మ్‌ చేస్తున్నారు. సినిమా చాలా బాగా వస్తోంది'' అన్నారు.

ప్రభుదేవా, తమన్నా, సోనూ సూద్‌, సప్తగిరి, మురళీశర్మ, హేమ, ప థ్వీ, షకలక శంకర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌, జి.వి.ప్రకాష్‌కుమార్‌, సినిమాటోగ్రఫీ: మనీష్‌ నందన్‌, ఎడిటింగ్‌: ఆంటోనీ, ఆర్ట్‌: వైష్ణరెడ్డి, సమర్పణ: కోన ఫిలిం కార్పొరేషన్‌, నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: విజయ్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.