close
Choose your channels

Adipurush : ఆదిపురుష్ డ్రాగన్ సీన్ రీక్రియేట్ ... ఔత్సాహికుడి టాలెంట్‌కు నెటిజన్ల ఫిదా

Friday, November 18, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘‘ఆదిపురుష్’’. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్‌లు చూసి హాలీవుడ్ రేంజ్‌లో ఊహించుకున్నారు ఫ్యాన్స్. అంతేకాదు.. వీటి దెబ్బకు ఆదిపురుష్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అంతేకాదు.. ఆదిపురుష్ నుంచి ఏదో ఒక అప్‌డేట్ రాకపోవడంతో.. ఫ్యాన్స్ గుస్సా అయ్యారు. తీరా టీజర్ బయటకు వచ్చిందో లేదో అందరి అంచనాలు ఆవిరైపోయాయి. ఇప్పటి వరకు ఏ సినిమా టీజర్‌కు రానంత స్థాయిలో వ్యతిరేకత, ట్రోలింగ్ ఆదిపురుష్ విషయంలో జరిగింది. చివరికి పార్టీలు, ప్రభుత్వాలు, కోర్టులు కూడా కలగజేసుకోవాల్సి వచ్చింది.

ఆదిపురుష్‌ టీజర్‌పై కోర్టుల్లో వ్యాజ్యాలు:

ఈ చిత్రంలోని రాముడి పాత్రతో పాటు రావణుడు, హనుమంతుడి గెటప్‌లను రామాయణంలో చెప్పినట్లు కాకుండా ఇష్టానుసారంగా తెరకెక్కించడంతో నెటిజన్లు, హిందూ సంఘాలు మండిపడ్డారు. మరీ ముఖ్యంగా రావణుడి పాత్రను ముస్లిం చక్రవర్తి అల్లావుద్దీన్ ఖిల్జీలా తీర్చిదిద్దారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ మేకర్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో పాటు రిలీజ్‌ డేట్‌ను కూడా వాయిదా వేశారు.

అదరగొట్టేశావ్ బాస్:

ఆదిపురుష్ గ్రాఫిక్స్ చెత్తలా వుందంటూ కామెంట్స్ వచ్చిన నేపథ్యంలో ఓ వ్యక్తి ఈ చిత్రంలోని ఓ సీన్‌ను సొంతంగా తీర్చిదిద్దాడు. టీజర్‌లో రావణ పాత్రధారి సైఫ్ అలీఖాన్ డ్రాగన్‌పై వస్తున్న సన్నివేశాన్ని ప్రకాశ్ అనే ఔత్సాహికుడు రీక్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. అది చూసిన వాళ్లంతా సినిమాలోని గ్రాఫిక్స్ కంటే ఇదే బాగుందని కామెంట్స్ పెడుతున్నారు. సో.. మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.