రాజ్ తరుణ్ ని సమ్మోహనపరచనుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్లో సక్సెస్ అర్జంటుగా కావాల్సిన హీరోల్లో రాజ్ తరుణ్ ఒక్కడు. దిల్‌రాజు తనతో సినిమాలు చేస్తానంటే ఇంకే బ్యానర్‌లోనూ ఒక్క సినిమా కూడా చేయకుండా, అన్నీ దిల్‌రాజుకే చేస్తానని గతేడాది ప్రకటించాడు రాజ్‌తరుణ్. దిల్‌రాజు అన్న కుమారుడు హర్షిత్ రెడ్డి తెరకెక్కించిన లవర్ రాజ్ తరుణ్‌కి పేరు తెచ్చిపెట్టలేదు. ఇప్పుడు ఆయన ఇద్దరి లోకం ఒకటే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారని టాక్ ఉంది.
విజయ్ కుమార్ కొండాకు తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. నితిన్‌కి మంచి హిట్ ఇచ్చాడు విజయ్. ఇప్పుడు రాజ్‌తరుణ్ ని దృష్టిలో ఉంచుకుని ఓ కథ రాసుకున్నాడు. అయితే ఇందులో నాయికగా అదితిరావు హైదరీని ఎంపిక చేసుకుంటున్నారట. సుధీర్‌బాబు సరసన సరిపోయిన అదితిరావు రాజ్ తరుణ్‌కి సరిపోతుందా? అనేది ప్రశ్న. అయినా ఆమె 80 లక్షలు అడిగినా కూడా ఇవ్వడానికి దర్శకనిర్మాతలు సిద్ధమయ్యారంటే ఆ పాత్రకున్న ఇంపార్టెన్స్ ఎలాంటిదో మరి. అదితిరావు హైదరి తెలుగులో గోల్డెన్ లెగ్గానే పేరు తెచ్చుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.