'మన్మథుడు2' అంతా సాఫీ.. నో వర్రీస్
Send us your feedback to audioarticles@vaarta.com
నాగార్జున నటిస్తున్న `మన్మథుడు2` ప్రారంభోత్సవం జరుపుకున్నప్పటి నుంచీ ఏదో ఒక రకంగా వార్తల్లో ఉంటూనే ఉంది. రకుల్కీ, నాగార్జునకూ పడటం లేదని కొంతసేపు, టీజర్ అనీ, దాన్ని చిన్మయి షేర్ చేసిందనీ, దానికి నెటిజన్లు దుమ్మెత్తి పోశారనీ, నిన్నటికి నిన్న అది ఫ్రెంచ్ చిత్రానికి ఫ్రీమేక్ అని... ఒకటేంటి.. ఎన్నెన్నో రకాలుగా ఈ సినిమా వార్తల్లో ఉంది. అయతే తాజాగా ఈ సినిమాకు ఎలాంటి వర్రీస్ లేవనీ, అంతా సాఫీగా ఉందని ఫిల్మ్ నగర్ టాక్. `ప్రీతీ మో తా మెయిన్` సినిమాకు ఫ్రీ మేక్ అని కొందరు భావించారు.
అయితే అందులో నిజం లేదట. అన్నపూర్ణ సంస్థ ఆ ఫ్రెంచ్ చిత్ర హక్కులను తీసుకునే ఈ చిత్రాన్ని నిర్మిస్తోందట. సో ఇబ్బంది పడాల్సిన పనే లేదట. ఒకవేళ అన్నపూర్ణ సంస్థ కనుక ఆ చిత్రం హక్కులు తీసుకోకపోతే ఒకసారి `జబర్దస్త్`, `అజ్ఞాతవాసి` చిత్రాలు ఎదుర్కొన్న సమస్యలను గుర్తు చేసుకుంటే చాలు..ఎన్నేసి ఇబ్బందులు చుట్టుముడుతాయో ఇట్టే గుర్తుకొచ్చేస్తాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.