close
Choose your channels

ఐశ్వర్వ సినిమా 'వీరన్'

Monday, October 3, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ర‌జ‌నీకాంత్ త‌న‌య‌, హీరో ధ‌నుష్ శ్రీమ‌తి ఐశ్వ‌ర్య ధ‌నుష్ ద‌ర్శ‌కురాలిగా రాణించాల‌ని త‌న వంతుగా ప్ర‌యత్నాలు చేస్తుంది. గ‌తంలో ధ‌నుష్‌, శృతిహాస‌న్‌ల‌పై ఐశ్వ‌ర్య డైరెక్ట్ చేసిన 3 సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. త‌ర్వాత ఐశ్వ‌ర్య మ‌రే సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌లేదు. చాలా సంవ‌త్స‌రాలు గ్యాప్ త‌ర్వాత ఐశ్వ‌ర్య మ‌ళ్ళీ మెగాఫోన్ ప‌ట్ట‌నుంది. సినిమా 24 శాఖ‌ల్లోని స్టంట్ మాస్ట‌ర్స్ క‌ష్ట‌న‌ష్టాల‌ను తెలియ‌జేస్తూ ఐశ్వ‌ర్య `సినిమా వీర‌న్` అనే పేరుతో డాక్యుమెంట‌రీని డైరెక్ట్ చేయ‌నుంద‌ట‌. ఈ సినిమాకు ర‌జ‌నీకాంత్ వాయిస్ ఓవ‌ర్‌ను అందిస్తుండ‌గా, ఎ.ఆర్.రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా రీసెంట్‌గా కేంద్ర‌మంత్రి వెంక‌య్యను క‌లిసి జాతీయ అవార్డ్స్‌లో ఫైట్‌మాస్ట‌ర్స్‌కు అవార్డు లేక‌పోవ‌డం విచార‌క‌ర‌మ‌ని, జాతీయ అవార్డ్స్‌లో ఫైట్ మాస్ట‌ర్స్ శాఖ‌కు చోటు క‌ల్పించాల‌ని కోరార‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.