close
Choose your channels

ఆమె బయోపిక్‌ చేయాలనుకుంటున్న అక్షయ్‌...

Monday, July 30, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆమె బయోపిక్‌ చేయాలనుకుంటున్న అక్షయ్‌... 

ప్రస్తుతం ఇండియన్‌ సినిమాల్లో బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తుంది. సినీ, రాజకీయ సెలబ్రిటీలతో పాటు దేశానికి గర్వకారణంగా నిలిచిన క్రీడాకారుల బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. ఈ విషయంపై బాలీవుడ్‌స్టార్‌ అక్షయ్‌కుమార్‌ను మీడియా .. మీకు బయోపిక్‌ నిర్మించే అవకాశం వస్తే .. ఎవరి బయోపిక్‌ నిర్మిస్తారు? అని ప్రశ్నిస్తే.. అక్షయ్‌ ఏమాత్రం తడుముకోకుండా హిమదాస్‌ బయోపిక్‌ నిర్మిస్తా అన్నారు.

అక్షయ్‌ గోల్డ్‌ సినిమా ఆగస్ట్‌ 15న విడుదలవుతున్న సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న అక్షయ్‌ ఇంకా మాట్లాడుతూ ''హిమదాస్‌ అసాధారణ అమ్మాయి.. దేశానికి ఎంతో పేరు తెచ్చింది. ఆమెకు సహకారం ఉంటే ఇంకా ఎంతో సాధిస్తుంది' అన్నారు. మరి అక్షయ్‌ హిమదాస్‌ బయోపిక్‌ రూపకల్పనకు ఎలాంటి అడుగులు వేస్తారో చూడాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.