అనుష్క సర్వ సన్నాహాలు
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
అనుష్క సర్వ సన్నాహాలు దేనికి? పెళ్లికా? అని అనుకుంటున్నారా? ఆ మాటను ఈ తుళు సుందరి ఎటూ చెప్పడం లేదనుకోండి. ఇక్కడ సర్వ సన్నాహాలు అని చెబుతోన్నది ఆమె తాజా సినిమా గురించి. అనుష్క నటిస్తున్న తాజా సినిమా భాగమతి. అశోక్ దర్శకత్వంలో ఎలాంటి సంచలనం లేకుండా షూటింగ్ జరుపుకున్న సినిమా ఇది.
గ్రాఫిక్స్ కి ప్రధాన్యత ఉన్న సినిమా కావడంతో రూపకల్పనకు మరింత సమయం పట్టింది. యువీ క్రియేషన్స్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి కీలక పాత్రలో కనిపిస్తారు. మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కూడా ఓ పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అనుష్క కీలక పాత్రల్లో నటించిన అరుంధతి, బాహుబలి చిత్రాల తరహాలోనే వీఎఫ్ ఎక్స్ కు మరింత ప్రాధాన్యత ఉంటుందని వినికిడి. సో ఇప్పటికే సంక్రాంతికి పెద్ద హీరోలు వరుస కడుతున్నారు. మహిళల తరఫున అనుష్క కూడా పోటీలో దిగుతోందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.