close
Choose your channels

సైలెన్స్‌... అనుష్కే కాదు మ‌రో ఇద్ద‌రు హీరోయిన్స్ కూడా...

Monday, January 14, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సైలెన్స్‌... అనుష్కే కాదు మ‌రో ఇద్ద‌రు హీరోయిన్స్ కూడా...

ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని బాహు భాషా చిత్రాన్ని నిర్మించనున్నాయి. తెలుగు, తమిళం, హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు తో నిర్మితమవుతున్న తొలి క్రాస్ ఓవర్ చిత్రమిది. ఈ చిత్రానికి సైలెన్స్ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. 'హార్రర్ ధ్రిల్లర్' గా రూపొందుతున్నఈ చిత్రంలో బహుభాషా నటుడు మాధవన్, అనుష్క శెట్టిల‌తో పాటు అంజలి, షాలిని పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు లు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

`వ‌స్తాడు నా రాజు` ఫేమ్ హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్, గోపి సుందర్, షనీల్ డియో,గోపి మోహన్, నీరజ కోన లు ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు. ఇతర తారాగణం, ``సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియ పరుస్తాం. మార్చి నెలలో చిత్రం షూటింగ్ అమెరికా లో ప్రారంభమవుతుందని, 2019 ద్వితీయార్ధంలో చిత్రం విడుదల అవుతుంద``ని నిర్మాత‌లు టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్ తెలియ‌జేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.