close
Choose your channels

'భలే మంచి రోజు' ఆడియో డేట్ ఫిక్స్..

Friday, November 13, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎస్.ఎం.ఎస్ సినిమా ద్వారా హీరోగా ప‌రిచ‌య‌మై..ప్రేమ‌క‌థా చిత్ర‌మ్, మోస‌గాళ్ల‌కు మోస‌గాళ్లు, క్రిష్ణ‌మ్మ క‌లిపింది ఇద్ద‌రినీ...ఇలా వైవిధ్య‌మైన చిత్రాల్లో న‌టించిన యంగ్ హీరో సుధీర్ బాబు. క్రైమ్ కామెడీ స్టోరితో సుధీర్ బాబు న‌టిస్తున్న తాజా చిత్రం భ‌లే మంచి రోజు. ఈ చిత్రం ద్వారా శ్రీరామ ఆదిత్య ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో సుధీర్ బాబు స‌ర‌స‌న వ‌మిక గ‌బ్బి హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ చిత్రం ఆడియోను ఈనెల 25న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. విజ‌య్, శ‌శి క‌ల‌సి సంయుక్తంగానిర్మించిన‌ ఈ చిత్రానికి స‌న్నీ ఎం.ఆర్ సంగీతాన్ని అందిస్తున్నారు. డిసెంబ‌ర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. డిఫ‌రెంట్ మూవీస్ తో ఆక‌ట్టుకుంటున్న సుధీర్ బాబు భ‌లే మంచి రోజుతో మ‌రో స‌క్సెస్ సాధిస్తాడ‌ని ఆశిద్దాం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.