close
Choose your channels

ఎన్టీఆర్ మహానాయకుడులో 'మహా' మిస్టేక్.. తేడా కొట్టేసిందిగా!?

Sunday, February 17, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎన్టీఆర్ మహానాయకుడులో మహా మిస్టేక్.. తేడా కొట్టేసిందిగా!?

దివంగత ముఖ్యమమంత్రి, ఆంధ్రుల అన్నగారు నందమూరి తారకరామారావు బయోపిక్ తీయాలని గత ఏడాది దర్శకులు పోటీపడిన సంగతి తెలిసిందే. రెండు మూడు భాగాలు అని కాకుండా ఆయన లైఫ్‌‌లో జరిగిన కొన్ని సంఘటనలు తీసుకుని ఒకే పార్ట్‌‌గా.. ఎన్టీఆర్ కుమారుడు బాలయ్య ప్రధాన పాత్రలో సినిమాను తెరకెక్కించాలని దర్శకుడు తేజ భావించారు. క్లాప్‌‌లు కొట్టారు.. పూజలు కూడా జరిగాయ్.. ఇక మొదలు పెట్టడమే లేటు అయితే ఇంతలో సడన్‌‌గా ఏం జరిగిందో ఏమోగానీ సినిమా ఆగిపోయింది. ఆ వ్యవహారంలో బాలయ్యది తప్పుందా..? తేజది తప్పుందా అనేది తెలియరాలేదు కానీ సడన్‌‌గా ఆగిపోవడంతో ఎన్నెన్నో పుకార్లు పుట్టుకొచ్చాయి. అప్పట్లో దాదాపు సినిమా స్క్రిప్ట్‌ను సీనియర్ రచయిత శ్రీనాథ్ రాశారు. రియల్‌స్టార్ శ్రీహరి హీరోగా వచ్చిన ‘కుబుసం’ సినిమాను శ్రీనాథే తెరకెక్కించారు. తేజ తెరకెక్కించాలనుకున్న ఎన్టీఆర్ బయోపిక్‌‌కు ఈయన కథ రాశారు.

సినిమా ఆగిపోవడంతో ప్రస్తుతం ఆ బయోపిక్ తాలుకు స్క్రిప్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిగో పక్కనున్న చిత్రంలో కాస్త నిశితంగా గమనిస్తే అసలు కథ ఏంటో మీకే అర్థమవుతుంది. బుర్రుమని ప్రత్యేక విమానంలో ఓ మహిళ భారీ కాన్వాయ్‌‌ దగ్గర దిగారు. అక్కడ్నుంచి కాన్వాయ్‌ వద్దకు చేరుకున్న ఆమె కారు కిటికీలో నుంచి చూస్తూ..(ఆ మహిళ ముఖం సరిగా కనపడలేదు) కాంగ్రెస్ జెండాలు పట్టుకుని ఉన్న కార్యకర్తలకు నమస్కరిస్తూ ముందుకు కదుతులుతున్నారు.

ఇందిరా గాంధీ ఎంట్రీ...

అయితే ఆ పక్కనే ఎన్టీఆర్ శ్రీకృష్ణావతారంలో ఉన్న భారీ విగ్రహం ఉంది. ఈ సందర్భంగా ఆ విగ్రహం గురించి ఓ అధికారితో ఆ మహిళ సంభాషణ ఉంది. అక్కడ సీన్ కట్ చేస్తే.. ఇందిరా గాంధీ కనపడతారు. ఇదంతా ఇందిరమ్మ ఓ భారీ బహిరంగ సభకు హాజరయ్యే టైమ్‌‌లో జరిగే సీన్‌‌లా ఉంది.

ఎన్టీఆర్ ఎంట్రీ...

మొదట క్లోజప్‌‌లో సైకిల్ చక్రాలు.. సైకిల్ రెండు పాల బిందెల కనపడతాయి. ఆ తర్వాత తిన్నగా ఆ సైకిల్‌‌పై ఉన్న వ్యక్తిని చూపిస్తారు. ఆఈయన తలకు టవల్, లుంగీ ధరించిన యువకుడు. కాదు కాదు యువ ఎన్టీఆర్. అలా ఎన్టీఆఈర్ ఎంట్రీ ఉంది. ఇక్కడ్నుంచి ఎన్టీఆర్ జీవిత కథ మొదలవుతుంది.

పైన చెప్పిన విషయాలన్నీ తేజ తెరకెక్కించాలనుకున్న ఎన్టీఆర్ బయోపిక్‌‌లోని కొన్ని సన్నివేశాలు. అయితే దాన్ని అటు ఇటు చేసి ప్రస్తుతం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’లో క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించారనేది తాజాగా విడుదలైన ట్రైలర్‌‌ను బట్టి చూస్తే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈయన రెండు భాగాలుగా తెరకెక్కించానుకోవడం పెద్ద బ్లండర్ మిస్టేక్ పలువురు సినీ విమర్శకులు, సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

చాలానే తేడా కొట్టిందిగా..!

ఇక క్రిష్ తెరకెక్కించిన సినిమా విషయానికొస్తే.. ఇందులో పెద్ద తప్పుల కుప్పే ఉంది. మొదటి భాగంలో ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఎన్టీఆర్‌కు పద్మ శ్రీ అవార్డు ఇచ్చారు. అయితే రెండో భాగంలో మళ్లీ ఇందిరను చూపిస్తూ అసలు ఇందిరకు.. ఆ ఎన్టీఆర్ ఎవరో తెలియనట్లుగా చూపించడం ‘మహా’ ఎబ్బెట్టుగా ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. అసలు ఫస్ట్‌పార్ట్‌లో ఇందరా పాత్ర తీసేసి ఉన్నా బాగుండేది.. మళ్లీ రెండో పార్ట్‌‌లో ఏంటి ఈ కథలు క్రిష్ స్వామీ అంటూ విమర్శలొస్తున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో క్రిష్‌‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంత బాలయ్య చెబితే మాత్రం ఆయన ఇష్ట్రప్రకారం సినిమా తీస్తారా..? లేకుంటే సినీ, నందమూరి అభిమానులను చూసే విధంగా సినిమా తీస్తారా అంటూ నెటిజన్లు కన్నెర్రజేస్తున్నారు. ముఖ్యంగా ఇందిరాగాంధీ దండంపెట్టే సీన్‌‌కు సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఈ ఫొటో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ కంట పడింది. అసలు ఎన్టీఆర్ బయోపిక్‌‌పై పీకల్లోతు కోపంతో ఉన్న ఆయన దీన్నే సువర్ణావకాశంగా వాడేసుకున్నారు. ఇదిగో చూడండి నిజా నిజాలేంటో అంటూ.. ఇందిర-ఎన్టీఆర్ రియల్‌‌ ఫిక్‌ను షేర్ చేశారు. దీంతో నెటిజన్లు కొందరు ఆయనకు సపోర్టు‌గా నిలవగా.. మరికొందరు టాపిక్‌‌ ఎక్కడికెక్కడో డైవర్ట్ చేస్తూ తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై క్రిష్, బాలయ్య ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.